Overflowing | గన్నేరువరం,ఆగస్టు10: మండలంలోని పారువెల్ల గ్రామ పెద్ద చెరువు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా చెరువు నిండు కుండలా మారింది. చెరువుకు వరద తాకిడి ఎక్కవవడంతో భారీ స్థాయిలో అలుగు పారుతోంది.
దీంతో గ్రామ శివారులో ఉన్న లోలేవల్ కల్వర్టు నుండి నీరు వెళ్లడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. పంటలకు కొదవలేదని రైతన్నలు తమకు రెండు పంటలకు నీరు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత పదిహేను రోజుల్లో అలుగు పారడం రెండో సారి అని పలువురు పేర్కొంటున్నారు.