SP Mahesh B. Geethe | విధి నిర్వహణ మానవీయమై ఉండాలి.. ఎస్పీ మహేశ్ బీ గీతే
ప్రజా సేవలో మానవత్వం, విధి నిర్వహణలో నిబద్ధత పోలీసుల లక్షణమై ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. రెండు రోజుల క్రితం మూర్ఛతో పడిపోయిన మహిళను రక్షించే యత్నం సోషల్మీడియా, పలు వార్తా కథనాలు వైరల్ కాగా మహేశ్. బీగీతే కానిస్టేబుల్, హోంగార్డును సోమవారం ప్రశంసించి మాట్లాడారు.
- మహిళా రక్షణ యత్నానికి పోలీసులకు ప్రశంస
SP Mahesh B. Geethe | ఎల్లారెడ్డిపేట, నవంబర్ 2 : ప్రజా సేవలో మానవత్వం, విధి నిర్వహణలో నిబద్ధత పోలీసుల లక్షణమై ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే అన్నారు. రెండు రోజుల క్రితం మూర్ఛతో పడిపోయిన మహిళను రక్షించే యత్నం సోషల్మీడియా, పలు వార్తా కథనాలు వైరల్ కాగా మహేశ్. బీగీతే కానిస్టేబుల్, హోంగార్డును సోమవారం ప్రశంసించి మాట్లాడారు. ప్రజల రక్షణే లక్ష్యంగా విధులు నిర్వహించడంతో పాటు, ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అన్నారు. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని మొదటి బైపాస్ రోడ్డుపై ఫిట్స్ వచ్చి అపస్మారక స్థితిలో పడిపోయిన మహిళకు తక్షణ సహాయం అందించి, మానవత్వం చాటుకున్న బ్లూకోట్ కానిస్టేబుల్ ప్రశాంత్, హోంగార్డు శ్రీనివాస్ చారికి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మహేష్ బి గితే ప్రోత్సాహకాలు, ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు.
పోలీసుల విధులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలిచి, అవసరమైన సమయంలో తక్షణ సహాయం అందించడం కూడా పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బంది మానవత్వం, సేవాభావం, నిబద్ధతతో విధులు నిర్వహించాలని సూచించారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ, సమయస్ఫూర్తితో స్పందించి ప్రజలకు మెరుగైన సేవలందించే సిబ్బందిని ఎప్పుడూ ప్రోత్సహిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతు సంక్షేమమే లక్ష్యంగా కృషి విజ్ఞాన కేంద్రం సేవలు’
Congress | ఢిల్లీ హోటల్లో తాగి కొట్టుకున్న మంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు
‘ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి చెంప దెబ్బ కావాలి’
Gadwal Collector | కలెక్టర్ పేరుతో నకిలీ వాట్సాప్ ఖాతా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రిజ్వాన్ బాషా షేక్
Sonia Gandhi meets Lalu Yadav | లాలూను కలిసిన సోనియా గాంధీ.. యూపీఏ పాలన, విధానాలను గుర్తు చేసుకున్న నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

