Chigurumamidi | చిగురుమామిడి, డిసెంబర్ 12 : గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోరుకు ప్రచారం ముగిసింది సార్వత్రిక ఎన్నికలను తలపించేలా కొనసాగిన ప్రచార పర్వం గ్రామాల్లో పూట పోటీగా అభ్యర్థులు ప్రచార సాధనాల ద్వారా హోరోత్తించారు. తమ పార్టీ మద్దతుదారులను గెలిపించాలని రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలు గ్రామాల్లో వారం రోజులుగా విస్తృత ప్రచారం చేశారు. ఇంటింటా తిరిగి బొట్టుపెట్టి అభ్యర్థులని గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు.
మండలంలోని 17 గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రజలలో పూర్తిస్థాయిలో ఆదరణ నెలకొందని అభివృద్ధిని చూసి ఓటు వేస్తారని బిఆర్ఎస్ అభ్యర్థులు ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు మద్యం డబ్బులతో గ్రామాల్లో విచ్చలవిడిగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పలు గ్రామాల్లో డబ్బులు పంపిణీ చేస్తున్న అభ్యర్థుల మద్దతుదారులను డబ్బులతో ప్రలోభాలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
మండలంలోని చిగురుమామిడి, బొమ్మనపల్లి, రేకొండ, సుందరగిరి, ముల్కనూరు, ఇందుర్తి, రామంచ, గాగిరెడ్డి పల్లె తదితర గ్రామాల్లో పోటా పోటీగా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. రేకొండ లో బీఆర్ఎస్ అభ్యర్థి మిద్దె రాములు శిష్య బృందంతో వినూత్నంగా డబ్బు చప్పులతో ప్రచారం నిర్వహించారు.