దీక్షతోనే ఉవ్వెత్తున ఉద్యమం.. కేసీఆర్ దీక్ష దేశ రాజకీయాలను మలుపుతిప్పింది
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడిందని, తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. దీక్షా దివస్ దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిందన్నారు.
- బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు
- జగిత్యాల జిల్లా కార్యాలయంలో దీక్షా దివస్ వేడుకలు
- తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
జగిత్యాల, నవంబర్ 29 : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడిందని, తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పేర్కొన్నారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. దీక్షా దివస్ దేశ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగిందన్నారు. ఈ మేరకు శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత తొలి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో ఒక మహత్తర మలుపు అని పేరొన్నారు.
ఆ దీక్ష ప్రజల్లో ఆత్మగౌరవ జ్వాలను మరింతగా రగిలించి రాష్ట్ర సాధనకు బాటలు వేసిందని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం తన ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ వచ్చేది మన పార్టీనేనని.. ఇందుకోసం కార్యకర్తలందరూ సమష్టిగా పని చేయాలని కోరారు. దీక్షా దివస్‌లో పాల్గొన్న ప్రతి ఒకరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు దీక్షా దివస్ నాటి చిత్రాలు, నాటి ఉద్యమ ఫొటోలు, వీడియోలను కార్యకర్తలు, నాయకులతో కలిసి చూశారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, డీసీఏంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, మార్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, ధర్మపురి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సంగి సత్తమ్మ, మాజీ కౌన్సిలర్లు దేవేందర్‌నాయక్, అవారి శివకేసరి బాబు, దారిశెట్టి రాజేశ్, మాజీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సింగిల్‌విండో చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ఇప్పటికీ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష
2002 నుంచి తెలంగాణ ఉద్యమం పట్ల ఆకర్షితులై, అభిమానిగా మారా. ఇప్పటికీ తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ శ్రీరామరక్ష. ఆయన అధికారంలో ఉండగా, రాష్ట్రం అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్‌వన్‌గా ఉండేది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. అభివృద్ధి అన్న మాట అసలే లేదు. ఎక్కడ భూములు కనపడితే అక్కడ అమ్మడం తప్ప, వేరేమార్గం లేదు. దీక్షాదివస్ సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమం ఉవ్వెత్తున చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. – కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

