ఆటోషో అదిరింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో కరీం‘నగరం’లోని మహాత్మా జ్యోతిబా ఫూలే (సర్కస్‌గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఎక్స్పో గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం ఉదయం 10 గంటలకు మొదలైన కార్యక్రమం, ఆదివారం రాత్రి 8 గంటలకు దిగ్విజయంగా ముగిసింది. చివరి రోజు కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కేశవ్ గ్రోవర్ హాజరై, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావుతో కలిసి స్టాళ్లను పరిశీలించారు. కొత్తగా వచ్చిన కార్ల మోడళ్లు, ఫీచర్ల గురించి అడిగి తెలుసుకుని, అనంతరం వేదికపై ప్రసంగించారు. షోలో స్టాళ్లను ఏర్పాటు చేసిన కంపెనీ ప్రతినిధులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఇటు సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో తరలిరాగా, మొత్తంగా మెగా వాహన మేళా విజయంతమైంది.
కార్పొరేషన్/ కమాన్‌చౌరస్తా, డిసెంబర్ 1: కరీంనగర్ జిల్లా కేంద్రంలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో షో గ్రాండ్ సక్సెస్ అయింది. మహాత్మా జ్యోతి బా ఫూలే (సర్కస్‌గ్రౌండ్) మైదానం వేదికగా నిర్వహించిన ఈ ఎక్స్పో రెండు రోజుల పాటు అదిరిపోయింది. ముగింపు కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్ కేశవ్ గ్రోవర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావుతో కలిసి వారు స్టాల్స్‌ను పరిశీలించారు. నూతనంగా వచ్చిన కార్ల మోడళ్లు, ఫీచర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. సందర్శకులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. 20 కిపైగా కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసి తమ మోడల్స్‌ను ప్రదర్శించగా, ఉత్సాహంగా పరిశీలించారు. వివిధ రకాల కార్లు, అందులో ఫీచర్లు, వాటి ధరల గురించి తెలుసుకున్నారు. కొందరు టెస్ట్ రైడ్ చేసి వాహనాల పనితీరును గమనించారు.
మరికొందరు వాహనాలను బుక్ చేసుకోవడమే కాదు, కొనుగోలు చేసి ఇళ్లకు తీసుకెళ్లారు. రెండు రోజుల్లో వచ్చిన స్పందనను చూసి కంపెనీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆటో షో సందర్భంగా రెండ్రోజులపాటు సందర్శకులు గిఫ్ట్ కూపన్లు వేయగా, ముగింపు కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వీర్ల వెంకటేశ్వర్రావు లక్కీ డ్రా తీశారు. విజేతలుగా నిలిచిన నలుగురికి అతిథులు బహుమతులు అందజేశారు. ముగింపు కార్యక్రమంలో యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జిలు ఐ సుభాష్, వీ సంపత్, సర్క్యులేషన్ మేనేజర్ పురుషోత్తం, స్టాఫర్ దొంత వెంకటస్వామి, ఫొటోగ్రాఫర్ బాలకిషన్‌రావు, హెచ్ఆర్ శ్రీలత, స్టోర్ ఇన్చార్జి రవి, టీ న్యూస్ ఇన్చార్జి వేణుగోపాల్, యాడ్స్ సిబ్బంది శ్రీధర్, కనకయ్య, రాజు, నమస్తే తెలంగాణ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శన
ఆటో షో ముగింపు కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు సందర్శకులు, స్టాల్స్ సిబ్బందిని అలరించాయి. సంగెం రాధాకృష్ణ బృందం, బాలభవన్ చిన్నారులు, బ్లూమెన్ డాన్స్ అకాడమీ కొరియోగ్రాఫర్ ఎస్ రామకృష్ణ బృందం చిన్నారులు చేసిన నృత్యాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. అనంతరం వీరికి జ్ఞాపికలను అందించారు.
ఆటో షో అభినందనీయం
ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో కంపెనీల కార్లు ఉన్నాయి. కొనుగోలు దారులకు సంతృప్తి కల్పించేలా ఒకే చోట 20 కంపెనీలకు చెందిన వాహనాలు, మూడు బ్యాంకులతో ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయం. వివిధ కంపెనీల వాహనాల వివరాలను ఒకే చోట తెలుసుకోవచ్చు. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– కేశవ్,గ్రోవర్, యూనియన్ బ్యాంకు చీఫ్ మేనేజర్
ఒకే చోట అన్నింటి సమాచారం
ఆటో షోల నిర్వహణ చూసినప్పుడల్లా చాలా ఆనందం వేస్తుంది. ఒక వాహనం కొనాలంటే పది మందిని అడుగుతుంటాం. పది షోరూంలు తిరుగుతుంటాం. ఒక వాహనాన్ని సోషల్ మీడియాలో ఒకరకంగా చూపెడుతారు. యూట్యూబ్‌లో మరో రకంగా చూపెడుతారు. కానీ, షోరూమ్‌కు వెళ్లి నేరుగా కండ్ల ముందు చూసి, ఆ మోడల్ ఏంటి? అందులో ఫీచర్లు ఏంటి? అనే వివరాలు తెలుసుకుంటే తప్ప కొనుగోలు దారులకు సంతృప్తి కలుగదు. ఇలా చేస్తే ఒక్క షోరూంలోనే సగం రోజు గడుస్తుంది. ఆ వెహికిల్ వివరాలు తెలుసుకొని ఇంటికి వచ్చి, మళ్లీ తెల్లారి ఇంకో షోరూంకు వెళ్లాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి.
కానీ, ఇలాంటి ఆటో షోల వల్ల ఒకే చోట పదిహేడు కంపెనీలకు చెందిన వాహనాల పూర్తి వివరాలను ఒక్క రోజులోనే తెలుసుకోవచ్చు. ఏ మోడల్లో ఎలాంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి? వాటి ధరలు ఎలా ఉన్నాయో..? కండ్ల ముందే తెలుసుకునే వీలుంటుంది. ఏ వాహనం ఎంత మైలేజ్ ఇస్తుంది? ఎంత వరకు సేఫ్టీ ఉంది? ఇలా అన్ని వివరాలను తెలుసుకునే అవకాశముంటుంది. ఇంకా బ్యాంకు లోన్ల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. దీని వల్ల ఏ వాహనం కోనుగోలు చేయాలనే విషయాన్ని తొందరంగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ఈ షో నిర్వాహకులు, పాల్గొన్న వివిధ కంపెనీల ప్రతినిధులు, బాంకు మేనేజర్లకు నా అభినందనలు. నగర వాసులు కూడా ఇలాంటి ఆటో షోలను సద్వినియోగం చేసుకోవాలి.
– మహేశ్వర్, కరీంనగర్ ఆర్డీవో
కొనడానికి ఆసక్తి చూపుతున్నరు..
కరీంనగర్ సర్కస్ గ్రౌండ్లో నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోషోలో మా మహవీర్ ఇస్సుఖీ స్టాల్‌ను అనేక మంది సందర్శించడం సంతోషంగా ఉంది. మా వాహనాలకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. 7 లక్షల కిలో మీటర్ల వరకు మా వాహనాలకు మన్నిక ఉండడంతో కొనడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నరు. మా వాహన శ్రేణిలో రూ.10 లక్షలతో ప్రారంభమై రూ.40 లక్షల వరకు విలువైన వాహనాలు అందుబాటులో ఉన్నాయి. ఫోర్ వీల్ డ్రైవ్, లైఫ్ ైస్టెల్ వాహనాలు మా సంస్థ ప్రత్యేకత. అందుకే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.
– మనోహర్, మహవీర్ ఇస్సుఖీ
తకువ వడ్డీకే రుణాలు
యూనియన్ బ్యాంక్ ఎవరూ ఇవ్వని విధంగా అతి తకువ వడ్డీ రేట్లతో వాహనాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నది. 8.7 వడ్డీ రేటుతో నూతన వాహనాలకు రుణాలు మంజూరు చేస్తున్నాం. మా బ్యాంక్‌లో హౌసింగ్ లోన్ ఉన్న కస్టమర్లకు ఏ వాహనం కొనుగోలు చేసినా దాని ఆన్‌రోడ్డు ధరలో 100 శాతం రుణ సదుపాయం కల్పిస్తున్నాం. ఈ రోజు ‘నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో చేసిన ఆలోచన గొప్పగా ఉంది. అన్ని రకాల కంపెనీల టూ వీలర్లు, కార్లు ఉంచడంతోపాటు రుణ సదుపాయం కోసం మా బ్యాంకు స్టాల్‌కు అవకాశం కల్పించడం సంతోషంగా ఉంది.
– వివేక్ కుమార్ గుప్తా, యూనియన్ బ్యాంక్
ప్రత్యేక రాయితీతో అందించాం
నిస్సాన్ బ్రాండ్‌కు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. ఈ షో ద్వారా చాలా మంది వాహనాలను చూసి ఆసక్తి కనబర్చారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే షో ద్వారా వాహనాలపై ప్రత్యేక రాయితీతో వాహనాలను ప్రజలకు అందించాం. మా వాహన శ్రేణిలో బేసిక్ వేరియంట్లో ఆరు ఎయిర్ బ్యాగ్స్‌తోపాటు గ్లోబల్ రేటింగ్ 4 ఉన్నది. రూ.7.28 లక్షల నుంచే వాహనాలు అందిస్తుండడంతో మధ్య తరగతి వారు కూడా వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. ఇలాంటి షోల ద్వారా అన్ని రకాల వాహనాలకు ప్రజలు చేరువయ్యే అవకాశం ఉన్నది.
– పాండు రంగ, లక్ష్మీ నిస్సాన్
అన్ని రకాల రుణాలు అందిస్తున్నాం
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు ఆటో షోలో పెద్ద సంఖ్యలో వచ్చిన సందర్శకులకు కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఆధ్వర్యంలో అందిస్తున్న అన్ని రకాల రుణాల గురించి వివరించాం. కేడీసీసీ బ్యాంక్ ఆధ్వర్యంలో గతంలో కేవలం రైతులకు అన్ని రకాల రుణాలు అందించేవాళ్లం. కానీ, ఇప్పుడు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, గృహాలకు కూడా రుణాలు అందిస్తున్నాం. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో సమానంగా రుణాలు అందిస్తుండడంతో అన్ని వర్గాలకు చేరువవుతున్నాం. వీటితోపాటు బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.5200 వరకు అందజేస్తున్నాం.
– శివ, ఎఫ్ఎల్సీ, కేడీసీసీ బ్యాంక్
ఇలాంటివి మరిన్ని నిర్వహించాలి
టొయాటోలో ప్రీమియం సెగ్మెంట్లో వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎక్కువ మంది కస్టమర్లు వీక్షించి వివరాలు తెలుసుకున్నారు. భారీ వాహనాలతోపాటు, మధ్యతరగతి వారికి అందుబాటులో ధరలు ఉండడంతో ఆసక్తి చూపున్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటో షో ద్వారా ప్రజల్లోకి వెళ్లే మంచి అవకాశం మాకు లభించింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నడిపి మరీ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఆటో షోలు మరిన్ని నిర్వహించాలి.
– అభిలాష్, ఏజీఎం, కాకతీయ టోయాటో
ఈవీ వెహికిల్స్‌కు గుర్తింపు
ఎంజీ కంపెనీ నుంచి వచ్చిన అనేక మోడల్ వాహనాలకు మారెట్లో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ కనిపిస్తోంది. ఇందులో ఈవీ వాహనాలకు మంచి గుర్తింపు ఉంది. ఒకసారి చార్జితో 300 కిలో మీటర్ల మైలేజ్ వచ్చే వాహనాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వాసులు వాహనాలను చూసి సంతోషం వ్యక్తం చేశారు. దాదాపు 50 మంది కొత్త వినియోగ దారులు మమ్మల్ని ఆశ్రయించారు. ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులు, వినియోగదారులకు కృతజ్ఞతలు.
– శ్రవణ్, ఎంజీ మోటార్స్
సద్వినియోగం చేసుకున్నారు
నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే స్టాల్లో ఎస్బీఆర్ ద్వారా వాహనాలు కొనుగోలు చేసిన వారికి తక్కువ వడ్డీకి లోన్స్ అందజేశాం. ఇందులో ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజ్ లేకుండా, వాహనం ధరలో 90 శాతం ఆన్‌రోడ్ ప్రైజ్ లోన్ ద్వారా అందజేస్తుండడంతో అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు. అలాగే, వాహనాల లోన్ క్లోజ్ చేసుకునే సమయంలో ప్రీ క్లోజర్ చార్జెస్ కూడా లేవు. ఇది మంచి అవకాశంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు కార్లకు 9.2 వడ్డీ రేటుతో రుణాలు అందిస్తున్నాం.
– దినకర్, ఎస్బీఐ
మంచి బుకింగ్స్ వచ్చాయి
నగరంలో ఏర్పాటు చేసిన ఆటో ఎక్స్‌పోలో మహీంద్రా వాహనాలకు మంచి బుకింగ్స్ వచ్చాయి. పెద్ద సంఖ్యలో సందర్శకులు వాహనాలు చూసి, వారికి కావాల్సిన వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు. మహీంద్రా తార్ రాక్స్, ఎస్యూవీ 700, 400 ఈవీ వాహనాలకు మార్కెట్లో మంచి స్పందన ఉంది. వాహనాలు ప్రజలకు చూపించేందుకు ఇది మంచి అవకాశంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మార్కెట్లోకి వచ్చే కొత్తవాహనాలను నేరుగా ప్రజల ముందుకు తీసుకు వెళ్లగలుగుతున్నాం.
– జర్నైల్ సింగ్, మహీంద్ర మోటార్స్