STUDENTS | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 11 : విద్యార్థులు చదువుకునే సమయం నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహించే విదంగా విద్యాభ్యాసంలో ముందుకు సాగాలని తెలంగాణ రాష్ర్ట గిడ్డంగుల సంస్థ పెద్దకల్వల బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మినర్సయ్యతో కలిసి ఆయన శుక్రవారం సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తమ కిష్టమైన కెరీర్ ఎంచుకోవాలని సూచించారు. ”ఓ” (ఔట్స్టాండింగ్ 85% పై మార్కులు) గ్రేడ్ సాదించిన విద్యార్థులను అభినందించి మరింత కష్టపడాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ కె లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ ఈ సంవత్సరము ఓ గ్రేడ్ సాధించిన విద్యార్థులు, ఇతర విద్యార్థులు యూనివర్సిటీ ర్యాంకు పై ప్రయత్నించాలని కోరారు.
దేశంలోనే పేరున్న సంస్థలైన ముంబైలోని సెబి, ఎన్ఐఎస్ఎం వారు ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించిన ఫైనాన్షియల్ లిటరసీ పోటీలలో కళాశాల నుంచి పది మంది విద్యార్థులు పాల్గొని సర్టిఫికెట్ పొందడం గొప్ప విషయమని అన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా డాక్టర్ ఏ సతీష్ కుమార్ వ్యవహరించగా అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ అకాడమీ కో ఆర్డినేటర్ డాక్టర్ జి పురుషోత్తం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.