Vemulawada | విద్యార్థులకు కడుపునిండా భోజనం పెట్టాలి.. ఖాళీ ప్లేట్లతో పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు జూనియర్ కళాశాల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని కొన్ని జిల్లాలకే పరిమితం చేసి నిర్లక్ష్యం చేస్తున్నారని పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ అన్నారు.
Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 25 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు జూనియర్ కళాశాల విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అమలు చేస్తామని కొన్ని జిల్లాలకే పరిమితం చేసి నిర్లక్ష్యం చేస్తున్నారని పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ అన్నారు. వేములవాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులతో కలిసి ఖాళీ ప్లేట్లతో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం, బ్రేక్ ఫాస్ట్ అమలు చేస్తామని చెప్పి, కేవలం కొన్ని జిల్లాలకే పరిమితం చేస్తూ నేటికీ కాలయాపన చేస్తూ విద్యార్థులతో జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేశామని, ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ పెడతున్నామని మాయమాటలు చెబుతూ విద్యార్థులను ఖాళీ కడుపులతో ఎండబెడుతున్నారని మండిపడ్డారు. కళాశాలలో కనీసం మరుగుదొడ్లు కూడా లేక ఇబ్బందులు పడుతుండగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మాటలతో కాలం గడుపుతుందని విమర్శించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు లోకిని రమేష్, జిల్లా నాయకులు కోనేటి ప్రశాంత్, సిరిసిల్ల డివిజన్ నాయకులు శివ, కార్తీక్, వనజ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

