తెలంగాణ చౌక్, ఫిబ్రవరి 28: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయాలని జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వెంకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ డే వేడుకకు హాజరై మాట్లాడారు. విద్యార్థుల నూతన ఆవిష్కరణకు రూపం దాల్చే విధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. విద్యార్థుల రూపొందించిన ఎగ్జిబిట్లను సందర్శించి ఉత్తమ ప్రతిభ చూపిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. నెహ్రూనగర్ ప్రాథమిక పాఠశాల, వివేకానంద విద్యానికేతన్ పాఠశాలల్లో సైన్స్ డే కార్యక్రమాలు నిర్వహించారు. ఇక్కడ హెచ్ఎం మల్లేశం, డీఎస్వో పాముల దేవయ్య, తదితరులు ఉన్నారు.
వేములవాడ రూరల్, ఫిబ్రవరి 28: వేములవాడ మండలం అగ్రహారం డిగ్రీ కళాశాలలో సైన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకొన్నారు. సమాజానికి ఉపయోగ కరమైన ఆవిష్కరణలు చేయాలని ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, క్విట్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఇక్కడ వైస్ ప్రిన్సిపాల్ తిరుకోవాల శ్రీనివాస్, అధ్యాపకులు రాజేశ్, రాజేశ్, నారాయణ, కరుణ, వెంకటేశ్వర్లు, ఉస్మాని, మల్లారెడ్డి, రమాదేవి, ప్రభాకర్, శ్రీనివాసులు, నర్సయ్య, మధుబాబు తదితరులు ఉన్నారు. అలాగే వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట, మర్రిపల్లి, రుద్రవరం, అనుపురం, బాలరాజుపల్లి, వట్టెంల గ్రామాల్లోని పలు పాఠశాలల్లో సైన్స్‌ఫెయిర్ నిర్వహించిచారు.
కోనరావుపేట, ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులు చేపట్టిన ప్రాజెక్టులను అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఇక్కడ ఎంపీడీవో ఓదెల రామకృష్ణ, ప్రిన్సిపాల్ కంకణాల సాగర్, ఎంపీటీసీ నరసింహాచారి, అధ్యాపకులు ఉన్నారు. అలాగే ధర్మారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేడుకలు నిర్వహించారు. ఇక్కడ హెచ్ఎం స్వప్న, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.
ముస్తాబాద్, ఫిబ్రవరి 28: మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లిష్ మీడియం, ఆవునూర్, ముస్తాబాద్, బంధనకల్ గ్రామాల్లోని పాఠశాలల్లో సైన్స్‌ఫెయిర్ నిర్వహించారు. రాఘవేంద్ర స్కూల్లో సర్పంచ్ గాండ్ల సుమతిని పాఠశాల నిర్వాహకులు సన్మానించారు. ఇక్కడ కరస్పాండెంట్ కటుకం నరేశ్, హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు మంజుల, అపర్ణ, శ్రీదేవి, సరిత, ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 28: తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్, అంకుసాపూర్ గ్రామాల్లోని పాఠశాలల్లో విద్యార్థులు వ్యాసరచన పోటీలతో పాటు వస్తువుల ప్రదర్శనలు నిర్వహించారు. ఇక్కడ హెచ్ఎంలు బండి ఉపేందర్, కరుణకార్రెడ్డి, ఉపాధ్యాయులు రవీందర్‌రెడ్డి, తిరుపతి,కీర్తి, పద్మ ఉన్నారు.
కోనరావుపేట, ఫిబ్రవరి 28: మండలం మరిమడ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ దినోత్సవం నిర్వహించారు. ఇక్కడ హెచ్ఎం భాస్కర్, సైన్స్ టీఆర్ పద్మజ, ఉపాధ్యాయులు ఈగ శ్రీనివాస్, రవి, కదిరె గంగాధర్ ఉన్నారు.
చందుర్తి, ఫిబ్రవరి 28: మండలం ఆశిరెడ్డిపల్లిలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్‌లు, యంత్రాలను ఎంపీడీవో రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ లీల పరిశీలించారు. ఇక్కడ సర్పంచ్ సుమ, శ్రీహరిరెడ్డి, హెచ్ఎం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ రాజు, వార్డు సభ్యులు ఉన్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 28: పట్టణంలోని శ్రీ సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించారు. సర్ సీవి రామన్ చిత్రపటానికి పాఠశాల కార్యదర్శి గర్శకుర్తి వెంకటేశ్వర్లు, మోటూరి మధు పూలమాలలు వేశారు. వేడుకల్లో భాగం గా విద్యార్థులు సైన్స్ గురించి వివరించారు. ఇక్కడ హెచ్ఎం చిలుక గట్టు, ఉపాధ్యాయులు, తదితరులు ఉన్నారు.