Potkapalli | ఓదెల : జూన్ 3 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల లోని కొలనూరు గ్రామం లో గుడుంబా స్థావరంపై రైడ్ చేసి 500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం, ఐదు లీటర్ల గుడుంబా ను పట్టుకున్నట్టు పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు.
ఈ సందర్భంగా పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ మాట్లాడుతూ గ్రామాలలో పేకాట, కోడి పందాలు ఆన్లైన్ బెట్టింగులు, క్రికెట్ బెట్టింగ్,బహిరంగ ప్రదేశంలో జూదం, మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 8712656514, కు సమాచారం అందించాలని సూచించారు.
చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఎంతటి వారినైనా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని ఎస్సై హెచ్చరించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ కిషన్, కానిస్టేబుల్స్ రాజేందర్, రాములు తదితరులు పాల్గొన్నారు.