కరీంనగర్ మారెట్ రోడ్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి సప్తమవార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం ప్రముఖ గాయని సునీత, గాయకుడు కారుణ్య స్వామి వారి సంకీర్తనలతో శ్రోతలను అలరించారు. ఈ సందర్భంగా గాయని సునీత మాట్లాడుతూ, తనకు కరీంనగర్ మరో పుట్టినిల్లు లాంటిదని, ప్రతి బ్రహ్మోత్సవాలకు రావడం స్వామి అనుగ్రహంతోనేనని చెప్పారు.
– కమాన్చౌరస్తా, ఫిబ్రవరి 19