Doctorate | తిమ్మాపూర్, డిసెంబర్ 11 : తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టాను ప్రదానం చేసినట్లు కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలియజేశారు. ‘రిస్టోరేషన్ ఆఫ్ కాంక్రీట్ (restoration of concrete beams affected by file damage) అనే అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టా పొందినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న కాలానికి ప్రపంచంలో వస్తున్న నూతన ఆవిష్కరణలకు అనుగుణంగా విద్యార్థులు, ప్రజలకు ఉపయోగపడే విధంగా మరిన్ని సరికొత్త పరిశోధనలు కూడా చేపట్టాలని సూచించారు. ప్రిన్సిపల్ డాక్టర్ జీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మరింత ఉత్సాహంతో సంబంధిత డిపార్ట్మెంట్ విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ విద్యార్థుల ప్రతిభకు తోడ్పడాలని కోరారు.
అంతేకాకుండా సివిల్ ఇంజనీరింగ్ లో ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో భవన నిర్మాణము చేసేందుకు మరింత ఆధునిక విజ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. డిపార్ట్మెంట్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. శ్రీరామ్ చంద్, పాలనాధికారి పాలవెల్ల రామారావు, మీడియా ఇంచార్జ్ గొంటి రమేష్, ఇతర డిపార్ట్మెంట్ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు అభినందలు తెలిపారు.