CP Amber Kishore Jha | పారిశ్రామిక సంస్థల భద్రతపై ప్రత్యేక నిఘా ఉంచాలి.. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కీలక పారిశ్రామిక సంస్థలు, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల భద్రతపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.
- ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన రామగుండం సీపీ
CP Amber Kishore Jha | జ్యోతి నగర్ : ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కీలక పారిశ్రామిక సంస్థలు, వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతాల భద్రతపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పెద్దపల్లి జోన్ పరిధిలోని ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న కమిషనర్‌కు గోదావరిఖని ఏసీపీ ఎం రమేష్, ఎన్టీపీసీ ఎస్ఐ వెంకట్ స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ కేంద్రం, సిబ్బంది బ్యారక్‌ను పరిశీలించారు.
స్టేషన్‌ను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, 5ఎస్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. రికార్డులను క్రమపద్ధతిలో నిర్వహించడంతో పాటు సీసీటీఎన్ఎస్లో కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడిన సీపీ వారి వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ఉద్యోగులు, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని తెలిపారు.
ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్ వంటి కీలక పారిశ్రామిక సంస్థలు ఉన్నందున భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. చిన్నపాటి నిర్లక్ష్యానికి కూడా తావివ్వకుండా నిరంతరం నిఘా కొనసాగించాలని, ముఖ్యమైన పరిణామాలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నమోదవుతున్న ప్రధాన నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలు, విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ తదితర అంశాలను ఎస్ఐను అడిగి తెలుసుకున్నారు.
ఆస్తి నేరాల నియంత్రణకు ప్రత్యేక రాత్రి గస్తీ నిర్వహించాలని, ఆకస్మిక తనిఖీలు చేపడుతూ పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలని సూచించారు. ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు, రోడ్డు ఇంజనీరింగ్‌లో అవసరమైన మార్పులను గుర్తించి సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు. పోలీస్ స్టేషన్ పనితీరు మెరుగుపరిచేందుకు కమిషనరేట్ ప్రధాన కార్యాలయం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని సీపీ భరోసా ఇచ్చారు. ప్రజలకు వేగవంతమైన, మెరుగైన పోలీస్ సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కమిషనర్ సూచించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anna Lezhneva | పవన్ కళ్యాణ్- అన్నా లెజినోవా వైవాహిక బంధంపై చర్చ.. ఆమె ఆస్తులు 18వేల కోట్లా..!
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

