Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
Matrimonial Dispute: భర్తతో పాటు అత్తామామ, మరుదులు వేధిస్తున్నట్లు ఓ పంజాబీ మహిళ న్యూజిలాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసులో కివీస్ పోలీసులు డిసెంబర్ 14వ తేదీన ఆ బాధిత మహిళ నుంచి వీడియో ద్వారా వాంగ్మూలాన్ని సేకరించనున్నారు.
న్యూఢిల్లీ: అత్తింటివారి వేధింపుల కేసులో.. కివీస్ పోలీసులు ఓ భారతీయ మహిళ వాంగ్మూలాన్ని వీడియో రికార్డింగ్ ద్వారా సేకరించనున్నారు. డిసెంబర్ 14వ తేదీన కివీస్ పోలీసులు ఆ స్టేట్మెంట్ తీసుకుంటారు. అయితే ఆ బాధితురాలు ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నది. భర్త, అత్తింటివారు క్రూరంగా వేధిస్తున్నారని, భౌతికదాడి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఓ పంజాబీ మహిళ కేసు పెట్టింది. ఖండాంతర గృహ హింస కేసులో తొలిసారి కివీస్ పోలీసులు స్టేట్మెంట్ తీసుకోనున్నారు. మైక్రోసాఫ్ట్ టీమ్‌ల ద్వారా ఆ వీడియోను రికార్డు చేయనున్నారు. కివీస్ పోలీసులకు బాధితురాలు అనేక మెయిల్స్ చేసిన నేపథ్యంలో కేసు దర్యాప్తునకు అంగీకరించారు. భర్త, అత్త, మరుదులు తనను వేధించినట్లు ఢిల్లీ పోలీసు మహిళా సెల్‌కు కూడా ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది. భార్యాభర్తల మధ్య వివాదం కేసులో విదేశీ పోలీసులు భారత నేలపై బాధితురాలిని విచారించడం ఇదే మొదటిసారి అవుతుంది.
అడ్వకేట్ అర్పిత్ బత్రా ఈ కేసుకు చెందిన వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్ కేసుల్లో బాధితులకు న్యాయం జరుగుతుందని, కివీస్ తీసుకున్న నిర్ణయం హర్షణీయమని ఆ లాయర్ తెలిపారు. ఫిర్యాదు ప్రకారం.. 2025 ఏప్రిల్ 19వ తేదనీ కివీస్ జాతీయుడిని పంజాబీ మహిళ పెళ్లి చేసుకున్నది. చండీఘడ్‌లోని హోటల్ పార్క్ గ్రాండ్లో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ పెళ్లి జరిగింది. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా.. పెళ్లికి ముందే పార్క్ గ్రాండ్ హోటల్ బస కావాలని అత్తామామలు బలవంతం చేసినట్లు చెప్పారు. పెళ్లి తర్వాత 2025 జూలై 2న ఆక్లాండ్‌కు బాధితురాలు వెళ్లింది. ఆ తర్వాత 2026 ఏప్రిల్ 21వ తేదీన ఆమె స్వదేశం తిరిగి వచ్చింది. పెళ్లి తర్వాత శారీరక, మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Matrimonial Dispute: భార్యాభర్తల గొడవ.. భారత మహిళ నుంచి వాంగ్మూలం తీసుకోనున్న కివీస్ పోలీసులు
‘చదువుకో తెలంగాణ’ పోస్టర్ ఆవిష్కరణ
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్య విద్యార్థుల పట్ల పోలీసుల దౌర్జన్యం.. వీడియో
Scene | సూర్య ‘సీన్’ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు ప్రశంసలు!
‘ప్రభుత్వాలు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

