Special prayer | కమాన్ చౌరస్తా, మే 13 : నగరంలోని రాంనగర్ రమాసత్యనారాయణ సహిత అభయాంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ దీక్షాపరులు హనుమాన్ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకు ముందు అర్చకులు అనిల్ కుమార్, ప్రవీన్ కుమార్ ఆంజనేయస్వామి ఉత్సవ మూర్తికి ఫలరస పంచావ నృతాభిషేకాలు జరిపి దీక్షా విశిష్టతను వివరించారు.
ఈ సందర్భంగా ఆలయ గౌరవాధ్యక్షుడు మల్లికార్జున రాజేందర్ మాట్లాడుతూ నమ్మకం, భక్తి, ఆర్ద్రతతో పిలిస్తే పలికే దైవం ఆంజనేయస్వామి అని, ఇంత పెద్ద ఎత్తున భజన, పూజలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. అనంతరం తీర్థ ప్రసాద, అన్నప్రసాద వితరణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చైర్మన్ చల్ల హరికృష్ణ, మాజీ చైర్మన్ ఎ కిరణ్, కుమార్, సభ్యులు సత్యనారాయణ, చెన్నయ్య, రవీందర్, హరీశ్ గౌడ్, దీక్షాపరులు దేవేందర్, శ్యామ్, అనిల్, శంకర్, పీఆర్ఓ మునిరాజ్ పాల్గొన్నారు.