కలెక్టరేట్, ఆగస్టు 18 : బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అవిశ్రాంత పోరాటం చేసిన సర్దార్ సర్వాయి పాపన్న నేటి తరానికి ఆదర్శనీయుడని కలెక్టర్ పమేలా సత్పతి కొనియాడారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వాయి పాపన్న 374వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్టమొదటి వీరుడు సర్వాయి పాపన్న అని కీర్తించారు. సాధారణ కుటుంబంలో జన్మించి పశువుల కాపరిగా, గీత కార్మికుడిగా కొనసాగిన తన ప్రస్థానంలో అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడు పాపన్న అని పేర్కొన్నారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన చేసి, పాపన్న చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్‌కుమార్, ఆర్డీవో కుందారపు మహేశ్వర్, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ అనిల్ ప్రకాశ్, సమాచార, పౌరసంబంధాల శాఖ ఇంజినీర్ సిహెచ్.కొండయ్య, పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రాంనగర్, ఆగస్టు 18 : కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటం వద్ద రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి పూలు సమర్పించి నివాళులర్పించారు. ఇతర పోలీస్ అధికారులతో పాటు, సీపీవోకు చెందిన మినిస్టీరియల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
విద్యానగర్ ఆగస్టు 18: కరీంనగర్‌లోని మానేరు వంతెన వద్ద గల సర్వాయి పాపన్న విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ దండు కొమురయ్య, పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, జిల్లా అధికార ప్రతినిధి బొంతల కళ్యాణ్, చంద్ర, బండారి గాయత్రి, పాదం శివరాజ్, కొమురె రవీందర్‌రెడ్డి, రవి, గోపాల్, అడిశెల రాజు, గుర్రం సంతోష్, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, ఆగస్టు 18: నగరంలోని బీఎస్పీ కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిషాని రామచంద్రం పూలమాల వేసి నివాళులర్పించారు. మొట్ట మొదటి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయిపాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు బాలయ్య, అంజయ్య, సత్యనారాయణ, సంపత్ పాల్గొన్నారు.
సైదాపూర్, ఆగస్టు 18: తొలి తెలంగాణ బహుజన రాజు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను పాపన్న గుట్టల్లోని పాపన్న విగ్రహం వద్ద, మండలకేంద్రంలో, దుద్దనపల్లి, ఎక్లాస్పూర్ గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు దొంత సుధాకర్, గౌడ సంఘం నాయకులు పైడిపల్లి రవీందర్, బొమ్మగాని రాజుగౌడ్, పైడిమల్ల తిరుపతిగౌడ్, గోపగోని నవీన్‌కుమార్, నాయకులు మిట్టపల్లి కిష్టయ్య, గుండారపు శ్రీనివాస్, ఊసగోయిల రాఘవులు, పోలు ప్రవీణ్‌కుమార్, లంకదాసరి మల్లయ్య, రచయిత మండల జంపయ్య పాల్గొన్నారు.
హుజూరాబాద్ టౌన్, ఆగస్టు 18: పట్టణంలోని సైదాపూర్ రోడ్డులో గల సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కందాల రాజుగౌడ్, పెరుమండ్ల సదానందం గౌడ్, మ్యాడగోని శ్రీనివాస్ గౌడ్, మాటూరి శ్రీనివాస్ గౌడ్, తాళ్లపెల్లి రాజమౌళి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జమ్మికుంట, ఆగస్టు 18: జమ్మికుంట పట్టణంలో పాపన్న విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్‌రావు, వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న-కోటి, కౌన్సిలర్లు, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి, స్థానికులకు పంచారు. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇల్లందకుంట, ఆగస్టు 18: మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ పాపన్నగౌడ్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇక్కడ గౌడ సంఘం నాయకులు శ్రీనివాస్, దేవేందర్, మొగిలి, సదయ్య, రవీందర్, తిరుపతి, సదానందం, రమేశ్, రాజయ్య, సమ్మయ్య తదితరులు ఉన్నారు.
రామడుగు, ఆగస్టు 18 : మండలంలోని గోపాల్రావుపేట, గుండి, రామడుగు, వెలిచాల, వెదిర తదితర గ్రామాల్లో గౌడసంఘాల ఆధ్వర్యంలో పాపన్న జయంతిని గీతకార్మికులు ఘనంగా జరుపుకొన్నారు. గోపాల్రావుపేటలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న విగ్రహానికి స్థానిక గౌడ సంఘం అధ్యక్షుడు కొండ వెంకటయ్యగౌడ్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలోని గీత కార్మికుల సంఘ భవనంలో పాపన్న చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఆయా గ్రామాల గౌడ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
గంగాధర, ఆగస్టు 18: మండలంలోని బూరుగుపల్లి, నారాయణపూర్, ఆచంపల్లి గ్రామాల్లో సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, నాయకులు దూలం శంకర్‌గౌడ్, దూలం ఆంజనేయులు, దూలం లింగగౌడ్, దూలం బాలాగౌడ్, గర్వందుల పరశురాములు, బొంగాని శ్రీనివాస్, గడ్డం శ్రీను, గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
వీణవంక, ఆగస్టు 18: మండల కేంద్రంలో గౌడ సంఘం మండలాధ్యక్షుడు తిప్పని సమ్మయ్య ఆధ్వర్యంలో పాపన్న జయంతి నిర్వహించగా, కోర్కళ్లో గౌడ సంఘం గ్రామాధ్యక్షుడు పూదరి సదానందం గౌడ్ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాళలు వేసి, నివాళులర్పించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజారంగౌడ్, మండల ప్రధానకార్యదర్శి పైడిమల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు నల్లగోని రమేశ్, కోర్కళ్ గ్రామ ఉపాధ్యక్షుడు పూదరి రమేశ్, కోశాధికారి సతీశ్, ముఖ్య సలహాదారు పూదరి కొమురయ్య, కొండల్‌గౌడ్, సంపత్‌గౌడ్, కృష్ణగౌడ్, అనిల్‌గౌడ్, మోహన్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడి, ఆగస్టు 18; మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి తిరుపతి, గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, గౌడ సంఘం జిల్లా నాయకుడు ఎస్ఎల్ గౌడ్, మండల నాయకులు ముంజ ప్రకాశ్, బుర్ర తిరుపతి, ముంజ వెంకన్న, సుధగోని శ్రీనివాస్, గుడాల సంపత్, తాళ్లపల్లి సంపత్, తోడేటి శ్రీనివాస్, పూదరి వేణు, రంగు శ్రీధర్, సమ్మయ్య, లింగంతో పాటు వివిధ పార్టీల నాయకులు మాజీ జడ్పీటీసీ గీకురు రవీందర్, చిట్టిమల్ల రవీందర్, బెజ్జంకి లక్ష్మణ్, ఎండీ సర్వర్ పాషా, బెజ్జంకి అంజయ్య, పెసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ రూరల్, ఆగస్టు 18: శ్రీనివాస్‌నగర్‌లో సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తి ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్ గౌడ్, మానకొండూర్ సొసైటీ అధ్యక్షుడు బండి చంద్రయ్య గౌడ్, వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.