తెలంగాణ చౌక్, జనవరి 8: ప్రజలకు సత్వర న్యాయం అందించేవిధంగా గ్రీవెన్స్ డే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్‌మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో 12మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్‌చేసి బాధితుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తున్నామని ఎస్పీ తెలిపారు. గ్రీవెన్ డే ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.
ఆరు నెలలు ప్రాక్టికల్ శిక్షణ కోసం రాహు ల్‌రెడ్డి ఐపీఎస్‌ను జిల్లాకు కేటాయించగా సోమవారం ఆయన ఎస్పీ అఖిల్‌మహాజన్‌కు రిపోర్టు చేశారు. 2022 బ్యాచ్ తెలంగాణకు చెందిన రాహుల్‌రెడ్డి బీటెక్ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ ద్వారా తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ కు ఎంపికయ్యారు. ఈ క్రమంలో ఆయన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
చందుర్తి, జనవరి 8: ప్రజా సమస్యల పరిషారం కోసమే ఈనెల 10న చందుర్తి పోలీస్ స్టేషన్లో ఠాణా దివస్ నిర్వహించన్నుట్లు ఎస్పీ అఖిల్‌మహాజన్ సోమవారం ఒక ప్రకటనలో పేరొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
సిరిసిల్ల రూరల్, జనవరి8: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్లో ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఇక్క డ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి, సీఐ సదన్‌కుమార్, ఎస్ఐ వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.