సిరిసిల్ల కలెక్టరేట్, సెప్టెంబరు 8: ట్విట్టర్లో రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధికారిక అకౌంట్ రాష్ట్రంలోనే టాప్‌గా నిలిచింది. 20,200 మంది ఫాలోవర్స్‌తో తొలిస్థానం సాధించింది. ప్రతి వెయ్యి మంది జనాభా ప్రాతిపదికన సెప్టెంబర్ మొదటి వారంలో సేకరించిన గణాంకాల ప్రకారం ఎక్కువ ఫాలోవర్స్ కలిగిన జాబితాలో ఫస్ట్ ర్యాంకు దక్కించుకున్నది. ఫాలోవర్స్‌పరంగా ప్రస్తుత ఏడాది త్రైమాసికం చివరలో 20 వేల మైలురాయిని దాటిన కలెక్టర్ అనురాగ్ జయంతి ట్విట్టర్ అకౌంట్‌ను ప్రస్తుతం 20,200 మంది అనుసరిస్తున్నారు.
సిరిసిల్ల జిల్లాలోని 5.46 లక్షల జనాభాకుగాను ప్రతి వెయ్యి మందిలో 37 మంది కలెక్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు. సంఖ్యాపరంగా చూసుకుంటే అత్యధిక మంది ఫాలోవర్స్ కలిగిన ట్విట్టర్ ఖాతాల జాబితాలో వైశాల్యం, జనాభాపరంగా చిన్న జిల్లా అయిన సిరిసిల్ల రెండో స్థానంలో ఉన్నది. ఇదే ఈ కేటగిరీలో 22 వేల మంది ఫాలోవర్స్‌తో కరీంనగర్ కలెక్టర్ ట్విట్టర్ అకౌంట్ ప్రథమ స్థానంలో ఉన్నది. అయితే సిరిసిల్ల జనాభాతో పోలిస్తే కరీంనగర్ జిల్లా జనాభా (10. 5 లక్షలు) రెండింతలు కావడం విశేషం. సిరిసిల్ల కలెక్టర్ అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించినప్పటి నుంచి కలెక్టర్ ఆఫీస్ క్రియాశీలకంగా నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల వివరాలు, మంత్రులు, జిల్లా కలెక్టర్, ఇతర వీఐపీల పర్యటనల వివరాలు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నారు. ప్రజా ఫిర్యాదులకు త్వరితగతిన స్పందిస్తున్నారు. ఈ కారణంగానే అనుసరించే వారి సంఖ్య పెరుగుతూ వస్తున్నది.