Sircilla Textile Park | రోజులుగా కొనసాగిన సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ కార్మికుల సమ్మె విరమణ
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచాలంటూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్మికులు వివిధ రకాలుగా ఆందోళనలు చేశారు. కలెక్టరేట్ ఎదుట సైతం ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వం, అధికారులు స్పందించారు.
- ప్రభుత్వ ఆర్డర్లకు కూలీ పెంచిన యాజమానులు
- అధికారుల సమక్షంలో కార్మికులతో యాజమానులు నిర్వహించిన చర్చలు
- ప్రైవేటు ఆర్డర్లకు మరో నెల రోజుల్లో కూలి పెంచుతామని హమీ
Sircilla Textile Park | సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 3: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమ్మెను కార్మికులు విరమించారు. 15 రోజుల క్రితం యాజమానులు కార్మికులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆర్డర్లకు కూలీ పెంచాలంటూ సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కార్మికులు వివిధ రకాలుగా ఆందోళనలు చేశారు. కలెక్టరేట్ ఎదుట సైతం ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు ప్రభుత్వం, అధికారులు స్పందించారు.
కలెక్టర్ ఆదేశాలతో చేనేత జౌళిశాఖ ఏడి సమక్షంలో టెక్స్టైల్ పార్క్ ఎవో కార్యాలయంలో టెక్స్టైల్ పార్క్ యాజమానులు, కార్మికుల సంఘనాయకులు, కార్మికులతో సమ్మె కూలీ డిమాండ్లపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కార్మికులు సమ్మె విరమణ పై విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం టెక్స్టైల్ పార్క్ ఉత్పత్తి అవుతున్న ప్రభుత్వ ఎస్సీ వెల్ఫేర్ ఆర్డర్ల వస్త్రానికి, కార్మికులకు ప్రస్తుత ఇస్తున్నకూలీ గిట్టుబాటు కావడం లేదని, పనిభారం పెరిగిందని పేర్కొన్నారు. మీటర్‌కు రూ.1 పెంచాలని ఇవ్వాలని యాజమానులను కోరారు.
రూ.25 పైసలు మాత్రమే పెంచి ఇస్తామని చెప్పారన్నారు. రెండు దఫాలుగా చర్చలు జరుగుగా మధ్యాహ్నం చివరకు మీటర్‌కు కనీసం 75 పైసలు పెంచివ్వాలని ఆడుగగా, 50పైసలు పెంచి ఇస్తామని చెప్పడంతో ఒప్పుకోకగా చర్చలు నుండి కార్మికులు బయటకు వచ్చారు. మధ్యాహ్నం తర్వాత చేనేత జౌళిశాఖ ఉన్నత ఆధికారులు, కమిషనర్, జాయింట్ డైరెక్టర్లు తమను సంప్రదించి, ప్రభుత్వ ఆర్డర్లు వస్త్రానికి మీటరుకు ఆదనంగా 85 పైసలు యాజయానులు ఇచ్చే విధంగా చూస్తామని పేర్కొన్నారు. అదే విధంగా వారం రోజుల్లో టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలపై ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసి, సమస్యలన్నింటిపై చర్చించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చినట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశానికి ముందే త్రిఫ్ట్, 10 శాతం యారన్ సబ్సిడీ డబ్బులు కూడా ఖాతాలలో జమ చేస్తామని కార్మికులతో చర్చించి పనులు ప్రారంభించే విధంగా చూడాలని చెప్పారన్నారు. తర్వాత కార్మికులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుని, కార్మికులతో చర్చించారు. మెజార్టీ కార్మికుల అభిప్రాయం మేరకు చేనేత జౌళిశాఖ ఏడీ, హైదరాబాద్ లోని జాయింట్ కలెక్టర్ లతో పోన్లో మాట్లాడి, అధికారులు ఇచ్చిన హామీ ప్రకారం హమీలను అమలుచేయాలని, యజమానులు ప్రభుత్వ వస్త్రాలను ప్రస్తుతం ఇస్తున్న కూలీ అదనంగా మీటర్ కు రూ.0.65 పైసలు పెంచి ఇస్తున్నట్లు యాజమానుల సంఘ నుండి సందేశాలను కార్మికులకు పంపించాలని, వారం రోజుల్లోపు సమావేశం ఏర్పాటు చేసి, త్రిఫ్ట్, 10శాతం యారన్ సబ్సిడీ డబ్బులు ఆందించి, సమస్యలు పరిష్కరించాలని విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రైవేటు వస్త్రానికి నెలరోజుల వరకు కూలీ పెంచాలి ఒప్పందం జరిపించే విధంగా చర్యలు తీసుకునేలా చేనేత జౌళిశాఖ అధికారులు ఇచ్చిన హమీల ప్రకారం కొన్నిషరతులతో కూడిన డిమాండ్లతో 15 రోజులుగా నిర్వహించిన కార్మికుల సమ్మెను విరమించినట్లు ప్రకటించారు. చర్చల్లో జేనేత, జౌళిశాఖ ఎడీ రాఘవరావు, యాజమానుల సంఘ అధ్యక్షుడు అన్నల్ దాస్ అనిల్, పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పార్క్ అధ్యక్షుడు కూచన శంకర్, శ్రీరాములు రమేష్ చంద్ర, సంపత్, శ్రీకాంత్, ఆంజనేయులు, శ్రీనివాస్, అంబదాస్, రమేష్, నర్సయ్య, చేనేత జౌళిశాఖ అధికారులు, యాజమానులు, కార్మికులు ఉన్నారు.
15 రోజులగా నిర్వహించిన సమ్మె విజయవంతం
టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపుతోపాటు సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన సమ్మె విజయవంతంగా ముగిసిందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. సమ్మెలో పాల్గోన్న కార్మికులు, సమస్యల పరిష్కారం కోసం కృషి చేసిన అధికారులకు, సమ్మెకు మద్దతుగా నిలిచిన సీపీఎం, సీఐటీయూ నేతలకు, సహకరించిన పవర్ లూం వర్కర్స్ యూనియన్ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- after 15 days
- Ends
- Sircilla
- strike
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

