Veenavanka | వీణవంక, జూన్ 27 : ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను (సర్) ప్రణాళికాయుతంగా త్వరితగతిన పూర్తి చేయాలని వీణవంక తహసీల్దార్ ముద్దసాని రమేష్ బీఎల్వోలను ఆదేశించారు. వీణవంక మండలంలోని రామకృష్ణాపూర్ గ్రామంలో ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, ఓటర్ల వివరాల సేకరణ చేపడుతున్న తీరును ఆయన శనివారం పరిశీలించి, ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ కార్యక్రమం పారదర్శకంగా, ఎలాంటి తప్పదాలకు తావులేకుండా నిర్వహించాలని బీఎల్ఎలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీవేణి-రాజు, ఉపసర్పంచ్ మహిపాల్‌రెడ్డి, ఆరి సతీష్, బీఎల్ఎ జ్యోతి, వార్డు సభ్యులు, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.