ముస్తాబాద్ : ముస్తాబాద్ మండలం బందనకల్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు బోల్తా పడ్డ(Car overturns) ఘటనలో పలువురు గాయపడ్డారు. ఎల్లారెడ్డిపేట మండలం గ్రామానికి చెందిన నవీన్, చరణ్, మనోజ్, మహ్మద్ అజ్జులు మంగళవారం పనిమీద హైదరాబాద్ఖు వెళ్లారు. బుధవారం ఉదయం ఇన్నోవా కారులో తిరుగు ప్రయాణంలో ముస్తాబాద్ మండలం చేరుకోగానే కారు ముందు టైరు పేలి పక్కనే ఉన్న కల్వర్టులో బోల్తా పడింది.
అక్కడే ఉన్న గ్రామస్తులు వెంటనే కారులో ఇరుక్కున్న ముగ్గురిని బయటకు తీసి ముస్తాబాద్ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.