Badibaata | కథలాపూర్ మే 12 : కథలాపూర్ మండలం చింతకుంట, రాజారామ్ తండా గ్రామాల్లోని పాఠశాలల్లో ముందస్తు బడిబాట కార్యక్రమం స్కూల్ కాంప్లెక్స్ HM మారంపల్లి అర్జున్ ఆధ్వర్యలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఉచిత విద్య అందించనున్నట్లు తెలిపారు. కావున పిల్లలు అందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. కాగా తల్లిదండ్రుల నుండి మంచి స్పందన లభించింది.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ నాగం భూమయ్య, మాజీ సర్పంచ్ బైర మల్లేశం, లోక నర్సారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎక్కలదేవి రవి, అరిసెల్ల సుధాకర్, జగన్, శేఖర్ మరియు నల్ల రాజయ్య, మామిడిపల్లి శ్రీనివాస్, కృష్ణారావు, సతీష్, బాల కిషన్, వెంకటేశ్వర బాబు, పరమేశ్వర్, ఉపాధ్యాయులు అరుణ, నాగజ్యోతి, చిరంజీవి, విజయ్, విశ్వనాథం, వెంకటేశం, విశ్వేశ్వర్, శ్రీనివాసస్వామి, రమాదేవి, అశోక్, వేణుగోపాల్, రమేష్, మాధుర్య ,రాజశేఖర్ , అంగన్వాడీ కార్యకర్తలు, సీఆర్పీ గణేష్ పాల్గొన్నారు.