School bus | తీరుమారని బడి బస్సు.. కొరడా ఝల్పిస్తున్న ఆర్టీవో అధికారులు
అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించేందుకు వెనుకడుగు వేస్తున్నారు.
School bus | తిమ్మాపూర్,జూన్22: అసలే చిన్నపిల్లలు.. వారిని తరలించేందుకు అన్ని అనుమతులు, నిష్ణాత్మలైన డ్రైవర్లు అవసరం. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలల యజమాన్యాలు మమ్మల్ని ఎవరేం చేస్తారని అనుకున్నారో ఏమో.. చిన్నపిల్లలను పాఠశాలలకు తరలించే స్కూల్ బస్సులకు ఫిట్నెస్ చేయించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. పాఠశాల ప్రారంభమై పది రోజులు అవుతున్నప్పటికీ అనేక సంఖ్యలో బస్సులు ఫిట్నెస్ చేయించుకోవాల్సి ఉంది. ఇందులో కొన్ని 15 సంవత్సరాల కాల పరిమితి దాటినమైనప్పటికీ వాటి యజమానులు రవాణా శాఖ అధికారుల వద్ద డిస్పోజల్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికీ పదుల సంఖ్యలో బస్సులు ఫిట్నెస్ కు రాకుండా మొండికేస్తుండడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగి ప్రత్యేక తనిఖీలు చేస్తూ పాఠశాల బస్సులను పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారు. శనివారం ఉదయం కరీంనగర్ లోని తీగల గుట్టపల్లి వద్ద ఫిట్నెస్ ఇతర పత్రాలు లేకుండా పిల్లలను తరలిస్తున్న ఓ ప్రైవేట్ పాఠశాల బస్సును ఏఎంవీఐ స్రవంతి పట్టుకొని కేసు నమోదు చేసి తిమ్మాపూర్ లోని రవాణా శాఖ కార్యాలయం తరలించారు. అన్ని పాఠశాలల బస్సులు ఫిట్నెస్ పూర్తయ్యే వరకు తనికీలు నిర్వహిస్తూనే ఉంటామని హెచ్చరించారు. తనిఖీల్లో సిబ్బంది శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- following
- Karimnagar
- Officials
- RTO
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

