Sanitation workers | కోల్ సిటీ, ఆగస్టు 18: ప్రమాదాలకు , అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఏసీ) జే అరుణ శ్రీ సూచించారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో సోమవారం పారిశుద్ధ్య సిబ్బందికి ఆమె రెయిన్ కోట్లను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్య సిబ్బంది భద్రత కోసం అందజేసిన వ్యక్తిగత రక్షణ కిట్ ఉపయోగించడంతో పాటు వర్షంలో రెయిన్ కోట్లను కూడా తప్పనిసరిగా ధరించాలని అన్నారు.
నాణ్యత లో రాజీ పడకుండా గతoలోకంటే మన్నికైన రెయిన్ కోట్లను తెప్పించి పంపిణీ చేయడం జరుగుతున్నదని అన్నారు. నగరంలో వర్షాలు విపరీతంగా కురుస్తున్న దృష్ట్యా అంటువ్యాదులు ప్రబలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామన్ , డీఈ శాంతి స్వరూప్ , సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ , సీనియర్ అసిస్టెంట్ శ్రీ పాల్, జూనియర్ అసిస్టెంట్ శంకర్ స్వామి తదితరులు పాల్గొన్నారు.