Sagara Sangam | మొగుళ్లపల్లి : మొగుళ్లపల్లి మండలంలోని కాసులపహాడ్ గ్రామ సర్పంచ్‌గా కుర్మ అయిలయ్య సగర ఎన్నికయ్యారు. కాగా తెలంగాణ రాష్ర్ట సగర సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు నలుబాల భిక్షపతి సగర, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట రాజు సగర, గ్రామ సగర కులస్తులు అయిలయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అయిలయ్య సగర మాట్లాడుతూ గ్రామ అభివృద్ధితో పాటు కుల సంఘం అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని హామీ ఇచ్చారు.