MLA Medipalli Satyam | గంగాధర, ఆగస్టు 22: పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పనుల జాతరలో భాగంగా గంగాధర మండలం గర్షకుర్తిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఉప్పరమల్యాల గ్రామంలో ఉపాధి హామీ లో భాగంగా నిర్మించిన పౌల్ట్రీ షెడ్డును ఆయన శుక్రవారం ప్రారంభించారు. జెండా పండుగలో భాగంగా గర్శకుర్తి లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గం లోని ప్రతీ గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలుపుతామని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్ రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్, దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, చిప్ప చక్రపాణి, రోమాల రమేష్, సత్తు కనుకయ్య, రాజేశం, బుర్గు గంగన్న, సాగి అజయ్ రావు, రాజగోపాల్ రెడ్డి, గునుకొండ బాబు, కర్ర బాపు రెడ్డి, పడితపల్లి కిషన్, వేముల అంజి, మ్యాక వినోద్, మంత్రి మహేందర్, చందు తదితరులు పాల్గొన్నారు.