Karimnagar | గన్నేరువరం, నవంబర్10 : గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి నుండి గన్నేరువరం మీదుగా డబుల్ రోడ్, లోలేవల్ కల్వర్టు వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి కి బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో తొందరగా డబుల్ రోడ్డు, కల్వర్టుల నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలన్నారు. అలాగే ఓవర్ లోడ్ తో రోడ్లను ధ్వంసం చేస్తూ వెళుతున్న గ్రానైట్ లారీలను పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.