Ramagundam | ఫర్టిలైజర్ సిటీ, జూన్ 14: ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరంలో రామగుండం శాసనసభ్యులు ఎం ఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రక్తదానం చేసి మానవతా విలువలకు గౌరవం చాటారు. తన ఉదారత తో యువతను రక్తదానానికి ప్రోత్సహిస్తూ మంచి సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, సింగరేణి అధికారులు, స్థానిక యువత, గణనీయమైన సంఖ్యలో రక్తదాతలు పాల్గొన్నారు.
రక్తదానం చేసిన తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ రక్తదానం ఒక ప్రాణదానమని, ఇది చేసే వారు నిజమైన హీరోలని అన్నారు. ప్రతీ ఆరోగ్యవంతుడు సంవత్సరానికి కనీసం రెండు సార్లు రక్తదానం చేయాలని సూచించారు. దీనివల్ల ఎదుటి జీవితాన్ని రక్షించడమే కాకుండా, మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే గోదావరిఖని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మడత రమేష్ తో పాటు పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్స్ తదితరులున్నారు.