Ramagundam CP | ఓదెల, ఫిబ్రవరి 26 : పెద్దపల్లి జిల్లాలోని ఓదెల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామిని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ చేతన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి వచ్చిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్‌కు ఆలయ అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీపీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీపీ, డీసీపీని ఆలయ అధికారులు సన్మానించి స్వామి వారి జ్ఞాపకార్థం అందజేశారు.
అనంతరం జాగారం కోసం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను సిపి శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. తిన్నారు కృష్ణ సంస్కృతిక కార్యక్రమాలను సిపి వీక్షించారు. అనంతరం చిన్నారుల అభినందించి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రామగుండం సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ.. స్వయంభుగా వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయం వద్ద ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో అకస్మాత్తుగా గుండెపోటుతో కింద పడిపోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిని సిపిఆర్ చేసి కాపాడిన ఎస్సై రమేష్‌తో పాటు అశోక్ కానిస్టేబుల్ ను రామగుండం సిపి శ్రీనివాస్ అభినందించి బహుమతి ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో డీసీపీ చేతన, ఏసీపీ కృష్ణ, సీఐలు సుబ్బారెడ్డి, ప్రవీణ్ కుమార్ ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు