Godavarikhani | కోల్ సిటీ, సెప్టెంబర్ 15: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే బతుకమ్మ వేడుకలను గోదావరిఖనిలో మహిళలు ముందస్తుగా జరుపుకున్నారు. రామ రామ రామ ఉయ్యాలో అంటూ మహిళలు ప్రకృతి పండుగను ఆరాధిస్తూ బతుకమ్మ ఆట.. పాటలతో హోరెత్తించారు. సోమవారం స్థానిక శ్రీ కోదండ రామాలయం ఆవరణలో మహిళలంతా ఒక చోటకు చేరి తీరొక్క పూలను తీసుకవచ్చి బతుకమ్మలను పేర్చి గౌరమ్మను పూజించి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ వేడకను ఘనంగా జరుపుకున్నారు.
పండుగకు ముందే మహిళలు ఎంతో ఉత్సుకతతో ప్రకృతితో మమేకమై వేడుకను కన్నుల పండువగా జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ వేడుకలో అభయ చారిటబుల్ ట్రస్టు చైర్పర్సన్ వెల్ది కవితతోపాటు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.