Thimmapur | తిమ్మాపూర్, అక్టోబర్ 5 : హైదరాబాద్ టు రామగుండం విస్తరించి ఉన్న రాజీవ్ రహదారిని నిర్వహణ పట్టించుకోకపోవడంతో అస్తవ్యస్తంగా తయారైన వైనంపై ‘నమస్తేతెలంగాణ’ ‘రాజీవ్ రహదారి.. అస్తవ్యస్తం’ పేరుతో కథనాన్ని సోమవారం ప్రచురిచింది. కాగాకరీంనగర్ జిల్లా పరిధిలో ఉన్న 40 కిలోమీటర్ల మేర సైనింగ్ బోర్డులు, గ్రామాలకు బోర్డులు, డివైడర్లు సూచికలు కనిపించకుండా చెట్లు పెరిగాయి.
బస్టాండ్లో సైతం క్లీన్ చేయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయింది. ఈ సమస్యలన్నింటిపై కథనం ప్రచురించగా స్పందించిన టోల్ యాజమాన్యం సిబ్బందితో క్లీన్ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా వాహనదారులు ‘నమస్తేతెలంగాణ’కు కృతజ్ఞతలు తెలిపారు.