వేములవాడ రూరల్, మార్చి 11: డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 2(Group 2 )పరీక్ష ఫలితాలను మంగళవారం టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇందులో వేములవాడ మండలం అగ్రహరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రంజిత్ (56) వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ .టి.శంకర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ .టి.లావణ్య స్టాఫ్ సెక్రటరీ శ్రీధర్ రావు అభినందించారు. కరీంనగర్ జిల్లా కేశవపట్నం ఆమ్లెట్ విలేజ్ పాపయ్యపల్లికి చెందిన పద్మ, మల్లేశం దంపతుల రెండవ కుమారుడు రంజిత్ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన రంజిత్ మొదటగా పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు గ్రూప్ 2 ఉద్యోగం సాధించడంతో పలువురు అభినందించారు.
దివ్యశ్రీకి 169 ర్యాంకు
ధర్మారం, మార్చి 11: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల తహసిల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మూటపల్లి దివ్యశ్రీ టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలలో 169 ర్యాంకును సాధించింది. ధర్మారం మండల కేంద్రం నివాసి అయిన ఈమె 2019 లో ఇదివరకే వీఆర్వో గా ఉద్యోగం సాధించి జూలపల్లి తహసిల్దార్ కార్యాలయంలో కొన్నాళ్లుగా పనిచేసింది. తాజాగా ఆమె గ్రూప్ 2 ఫలితాలలో 169 ర్యాంకు సాధించింది.