Korutla | కోరుట్ల, జూన్ 8: కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-2 అధికారిగా ఎంపికై శిక్షణ అనంతరం మొదటిసారిగా కోరుట్ల మున్సిపల్ కమిషనర్ గా రాఘవేంద్ర నియమితులయ్యారు. ఇక్కడ గతంలో ఇంచార్జీ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వర్తించిన శ్రీనివాసరావు ధర్మపురి మున్సిపల్ కమిషనర్ గా ఉన్నారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాఘవేంద్రను మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఉద్యోగులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.