Quiz competitions | కాల్వశ్రీరాంపూర్, జనవరి 24 : విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో దోహదపడతాయని కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్ రావు అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వర్ ఆధ్వర్యంలో మండల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ క్విజ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు తహసీల్దార్ జగదీశ్వరరావు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్ చేతుల మీదుగా నగదు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ జగదీశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులకు భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించడానికి విద్యార్థుల్లో జ్ఞానదృష్టి పెంపొందించడానికి విద్యార్థులకు క్విజ్ నిర్వహించామన్నారు. భవిష్యత్లో ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని, సమాజంలో అన్ని అంశాలపై విద్యార్థి దశలోనే అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ వజహత్ అలీ, రెవెన్యూ సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.