మార్పు అంటే పంటలు ఎండ బెట్టుడేనా..?
‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు.
- పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
మంథని రూరల్, మార్చి14: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ పాలన, మార్పు వస్తుందని గొప్పలు చెప్పిన్రు. అసలు మార్పు అంటే పంటలు ఎండబెట్టుడేనా..?’ అని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జడీ చైర్మన్ పుట్ట మధూకర్ మండిపడ్డారు. ఇప్పటికే పంటలు పెద్దఎత్తున ఎండిపోయాయని, మిగిలిన పంటలకైనా నీరందించి కాడాపాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. మంథని మండలం మైదుపల్లి, కాకర్లపల్లి శివారులో పొట్టదశలో ఎండిపోయిన పంట పొలాలు, నెర్రెలు బారిన భూములను గురువారం ఆ యన పరిశీలించారు. పంటల పరిస్థితి గురిం చి రైతులను అడిగితెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పదేళ్ల తర్వాత రైతులను నీళ్ల కోసం రోడ్డెకించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని ఆగ్రహించారు.
నీళ్లు, కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్, కనీసం పట్టించుకోవడం లేదని అందుకే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలబడ్డారని, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ కాలువల ద్వారా నీరందించి చివరి ఆయకట్టులో ఒక ఎకరం ఎండిపోకుండా నీరందించారని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎల్లంపల్లి, ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీళ్లున్నా పంటలు ఎండబెట్టడం సరికాదన్నారు. మార్పు.. మార్పు అంటే మూడు పంటలకు నీళ్లు వస్తాయని రైతులు ఆశపడ్డారని, కానీ, ఒక్క పంటకూ కూడా నీరందించని దుస్థితి తెచ్చారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని, అందుకే సాగునీరు అందించడం లేదని ఆరోపించారు. ఇక్కడ నాయకులు తగరం శంకర్లాల్,ప్రభాకర్ రెడ్డి,రాజు గౌడ్, కనవెన శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

