Jagityal | కథలాపూర్, ఏప్రిల్ 11 : గ్రామాల్లోని రైతుల సౌకర్యం కోసమే గ్రామాల్లో వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలంలోని కలికోట, అంబారిపేట, ఇప్పపెల్లి, దుంపేట, దూలూరు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.
దళారులకు ధాన్యం రైతులు మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ నాగం భూమయ్య, కథలా పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్ర నారాయణ రెడ్డి, మార్కెటి కమిటీ మాజీ చైర్మన్ వర్ధినేని నాగేశ్వర్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్, మాజీ సర్పంచులు దారావత్ సరోజ సీతారాం, కొలి వసంత నరేందర్, గోపు శ్రీనివాస్, అంబటి లత పురుషోత్తం, మాజీ కో ఆప్షన్ సభ్యులు ఎండీ రఫీ, ఎంపీటీసీలు గంగం దేవేంద్ర గంగారెడ్డి, వేముల గంగరాజం, పాక్స్ వైస్ చైర్మన్ మిట్ట పెల్లి లక్ష్మి, గంగారెడ్డి, పాక్స్ డైరెక్టర్ క్యాతం అనంత రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బొమ్మ రాజేశం, జెల్లా వేణు గోపాల్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, జగిత్యాల జిల్లా మాజీ రైతు సమితి సభ్యులు చీటి విద్యాసాగర్ రావు, కరిపే సత్యం, Vdc సభ్యులు, పాక్స్ సీఈఓ ఉషాకోళ్ల అరుణ్, సిబ్బంది నక్క రవి, చెన్నవేణి భాను చందర్, ఏలేటి సంజీవ్, రాగుట్ల విజయ్ తదితరులు పాల్గొన్నారు.