Collector Sandeep Kumar Jha | రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్, జూలై 7: ప్రజావాణిలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 151 దరఖాస్తులు కలెక్టర్ స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
ఇందులో రెవెన్యూ-48, హౌసింగ్ -36, డీఆర్డివో-23, డీపీఓ -10, జిల్లా విద్యాధికారి-8, జిల్లా ఉపాధి కల్పనాధికారి-5, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్-3, జిల్లా సంక్షేమ అధికారి-3, ఎస్ డీ సీ-2, ఎస్పీ, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఈ ఈ ఇరిగేషన్, ఎండీ సెస్, ఎల్ డీ ఎం, ఈఈపీఆర్, ఈఓఎస్, ఆర్ఆర్ టెంపుల్ వేములవాడ, జిల్లా పౌరసరఫరాల అధికారి, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ ఎస్ ఎల్ ఆర్, జిల్లా వైద్యాధికారి, ఈడీ ఎస్సీ కార్పొరేషన్, ఈడీఎంకు ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.