కమాన్చౌరస్తా, జనవరి 22 : ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యత అని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణు గోపాల్ పేర్కొన్నారు. కరీంనగర్ పర్యటనకు వచ్చిన సందర్భంగా ‘శ్రీకారం ఫౌండేషన్’ ఆధ్వర్యంలో బా లికల సంరక్షణ అవగాహన పోస్టర్ను ఆదివా రం ఆయన నివాసంలో ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమాజంలో త రతరాలుగా మహిళలు వివక్షకు గురవుతున్నారని చెప్పారు. వారి హక్కులపై చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదన్నా రు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్, శ్రీకారం ఫౌండేషన్ చైర్మన్, జాతీయ యువజన అవార్డీ ఏ కిరణ్ కుమార్, ఆవాజ్ ఫౌండేషన్ చైర్మన్ ఏవీ రమణ, హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు జ కుల రాజు, శ్రీకారం ఫౌండేషన్ ప్రతినిధులు మదన్మెహన్, బ్రహ్మచారి పాల్గొన్నారు.