Vemulawada | వేములవాడ, సెప్టెంబర్ 5 : ప్రభుత్వం రెడ్డి సామాజిక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఇచ్చిన హామీలు విస్మరిస్తున్నందున చేపట్టనున్న రెడ్డి నిరసన దీక్షను విజయవంతం చేయాలని జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అన్నారు. శనివారం వేములవాడలో ఆయన రెడ్డి నిరసన దీక్ష పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిధులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని అన్నారు.
ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 8వ తేదీన హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన ఒక్కరోజు రెడ్డి నిరసన దీక్షకు పెద్ద ఎత్తున రెడ్డి సామాజిక వర్గం ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి, నాయకులు ఏనుగు తిరుపతిరెడ్డి, లింగారెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు ఉన్నారు.