Peddapally | పెద్దపల్లి, అక్టోబర్25 : స్వచ్ఛందంగా రక్త దానం చేయుటకు యువత ముందుకు రావాలని రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా చైర్మన్ కావేటి రాజగోపాల్ కోరారు. రక్త దానంపై అపోహాలు వద్దని ఆరోగ్యవంతమైన యువకులు కనీసం ఏడాది రెండు సార్లు రక్తదానం చేయవచ్చుని సూచించారు.
సామాజిక సేవకుడు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుడు బత్తిని అనిల్ కుమార్ తన పుట్టిన రోజు పురస్కరించుకుని శనివారం స్థానిక బ్లడ్ బ్యాంక్లో 10వ సారి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్కు జన్మదిన శుభకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు డీవీఎస్ మూర్తి, పంపాటి శ్రీకాంత్, గోల్కొండ అరవింద్ రెడ్డి, సురేష్, రాము తదితరులు పాల్గొన్నారు.