స్వరాష్ట్రంలో హుస్నాబాద్ సస్యశ్యామలం
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజర్వాయర్ నీళ్లు ప్రతి ఎకరాకు అందితే ఈ ప్రాంతం కోనసీమను తలపిస్తుందన్నారు.
- మూడోసారి ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్‌ను హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదించాలి
- హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
2014కు ముందు నిత్యం కరువు కాటకాలతో కల్లోలిత ప్రాంతంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం సీఎం కేసీఆర్ కృషితో సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. ఆయన చలవతోనే పూర్తయిన గౌరవెల్లి రిజర్వాయర్ నీళ్లు ప్రతి ఎకరాకు అందితే ఈ ప్రాంతం కోనసీమను తలపిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌కు లక్ష్మి నియోజకవర్గంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం రూ.9వేల కోట్లతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. హుస్నాబాద్‌కు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మిడ్‌మానేరు-తోటపల్లి, దేవాదుల, కాకతీయ కాల్వ ద్వారా నియోజకవర్గంలో 60వేల ఎకరాలకు సాగునీరందుతోందని, దీంతో నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లో పుష్కలంగా పంటలు పండుతున్నాయని చెప్పారు.
ప్రతి గ్రామంలో కనీసం రూ.60లక్షల అభివృద్ధి పనులు జరిగినట్లు తెలిపారు. గిరిజన తండాల రోడ్లకు రూ.61కోట్లు వెచ్చించామంటే ఎంత అభివృద్ధి జరిగిందో అర్థమవుతున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిర్వాసితులను రెచ్చగొట్టి కేసులు వేయకుంటే గౌరవెల్లి రిజర్వాయర్‌ను ఇప్పటికే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకునే వాళ్లమని, ఆ రెండు పార్టీల నాయకులకు ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు రావడం ఇష్టం లేదని విమర్శించారు. వారికి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. మూడోసారి సీఎంగా కేసీఆర్‌ను, ఎమ్మెల్యేగా తనను ఆశీర్వదించాలని కోరారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

