పెద్దపల్లి, డిసెంబర్ 5: మానవాళి మనగడకు పెను ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్‌పై పెద్దపల్లి బల్దియా సమర భేరి మోగించింది. నియంత్రణకు నడుంబిగించింది. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ మమతారెడ్డి సూచనలతో వారం రోజుల నుంచి పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఏరివేతకు ఉపక్రమించింది. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్నది. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు విధిస్తున్నది. జనవరి 1, 2023 నుంచి 125 మైక్రాన్లలోపు మందం ఉన్న పాలిథిన్ కవర్లపై నిషేధం విధించింది.
పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ భూతా న్ని తరిమికొట్టేందుకు పెద్దపల్లి మున్సిపాలిటీ చర్యలు చేపడుతున్నది. వారం నుంచి ఈ మహమ్మారి నియంత్రణ దిశగా ముందుకు కదులుతున్నది. ఇందులో భాగంగా వారం నుంచి ఏరివేత కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తున్నది. ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది ఈ యజ్ఞంలో భాగస్వాములవుతున్నారు.ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై మెప్మా మహిళలు ఇంటింటికీ వెళ్లి అవగాహన కలిగిస్తున్నారు. బట్ట సంచుల్లోనే సామగ్రిని తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.
పెద్దపల్లి బల్దియా పరిధిలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమం ఓ యజ్ఞంలా సాగుతుంది. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి పట్టణవాసులు కదులుతున్నారు. వారం నుంచి ప్రతిరోజూ ఉద యం 6 నుంచి 9 గంటల వరకు ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేతను చేపట్టారు. ఇందులో సు మారు 200 మంది భాగస్వాములవుతున్నారు. ఇప్పటి వరకు 7 వార్డుల పరిధిలో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఈనెలాఖరు వరకు పట్టణంలో అన్ని వార్డుల్లో ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జనవరి1, 2023 నుంచి పట్టణంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగించిన వారిపై జరిమానాలు విధించనున్నారు. ప్రజలు ప్లాస్టిక్ కవర్లు రోడ్లపై వేయరాదని, తడి, పొడి చెత్తను ఇండ్ల వద్దే వేరుచేసి ఉదయాన్నే ఇండ్ల వద్దకు వచ్చే మున్సిపల్ వాహనాలకు అందించాలని సూచిస్తున్నారు.
ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆదేశాలతో పెద్దపల్లి బల్దియా పరిధిలో ప్లాస్టిక్ వ్యర్థాల ఏరివేత పకడ్బందీగా సాగుతున్నది. ఇప్పటి వరకు 7 వార్డుల పరిధిలో ప్లాస్టిక్ కవర్ల ఏరివేసే కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఈనెలాఖరులోగా మిగిలిన వార్డుల్లో కూడా ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. జనవరి 1, 2023 నుంచి పట్టణంలో 125 మైక్రాన్ల మందం లోపున్న ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తాం. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వినియోగిస్తే జరిమానా విధిస్తాం.
– శ్రీనివాస్‌రెడ్డి, బల్దియా కమిషనర్, పెద్దపల్లి
పట్టణంలో వారం నుం చి ప్లాస్టిక్ ఏరివేత కార్యక్రమాన్ని చేపట్టాం. ప్లాస్టిక్‌ను వాడద్దని ప్రజలకు చెచితే పట్టించుకోవడం లేదు. దీంతో నేనే స్వ యంగా ప్లాస్టిక్ సేకరణలో పాలుపంచుకుంటు న్నా. 200 మంది ఈ కార్యక్రమంలో భా గస్వాములవుతున్నారు. దుకాణాల నిర్వాహకులకు సైతం అవగాహన కల్పిస్తున్నాం. పట్టణవాసులు సహకరించాలి.
-మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్యే, పెద్దపల్లి
పెద్దపల్లిలో పచ్చదనం పెంచి, పరిశుభ్రత కో సం కృషి చేస్తున్నాం. తడి పొడి చెత్తను వేర్వేగా సేకరిస్తున్నాం. ప్లాస్టిక్ నియంత్రణపై దృష్టి పెట్టాం. అన్ని వా ర్డుల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తు న్నాం. పట్టణవాసులు 125 మైక్రాన్ల కన్నా ఎకువ మందం ఉన్న పాలిథిన్ కవర్లను మాత్రమే వాడాలి.
– మమతారెడ్డి, చైర్పర్సన్, పెద్దపల్లి బల్దియా