పెద్దపల్లి : హత్యకు గురైన న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిలకు(Vaman Rao Couple) మంథని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మంథని బార్ అసోసియేషన్ ఆవరణలో అధ్యక్షుడు కేవీఎల్ఎన్ హరి బాబు ఆధ్వర్యంలో నాగమణి, వామన్ రావు చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ.. న్యాయవాదుల రక్షణ చట్టం తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం కారణంగా రోజు రోజుకు దాడులు పెరుగుతున్నాయన్నారు.
వీటిని అరికట్టడానికి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యాక్షుడు కేతిరెడ్డి రఘోత్తమ్ రెడ్డి, కార్యదర్శి ముస్కుల సహేందర్ రెడ్డి, న్యాయవాదులు సువర్ణ చంద్రశేఖర్, ఎస్. భాస్కర్ రెడ్డి, చంద్రుపట్ల రమణకుమార్ రెడ్డి, బొట్ల ఆంజనేయులు, శశి భూషణ్ కాచే, ఆర్ల నాగరాజు, దహగమ్ శ్రీనాథ్, బక్కతట్ల సతీష్, భాగ్యలక్ష్మి, రాచర్ల రాజేందర్, వ్యాస్ కుమార్ పాల్గొన్నారు.