పెద్దపల్లి ఆగస్టు 26 : విదేశీ ఉపాధికి భరోసాగా టామ్ కామ్ పని చేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం టామ్ కామ్ కోర్సులపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టామ్ కామ్ సంస్థ యువతకు విదేశాలలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్ శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తుందన్నారు.
నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టామ్ కామ్ మేనేజర్ ఎస్. షబ్నా, జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు, జిల్లా పరిశ్రమల అధికారి ఏ కీర్తి కాంత్ సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.