టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీశ్‌గౌడ్
పెద్దపల్లిలో సంబురాలు
పెద్దపల్లిటౌన్, ఆగస్టు 11: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌యాదవ్ పేరు ఖరారు చేయడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట టీఆర్ఎస్వీ నాయకులు పటాకులు కాల్చి, సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీశ్‌గౌడ్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ కేటాయించడం హర్షణీయమని కొనియాడారు. కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీనివాస్‌యాదవ్ విద్యార్థులను ఐక్యం చేసి అనేక పోరాటాలు చేశారని గుర్తుచేశారు. పెద్దపల్లి నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లి ఆయనకు మద్దతుగా ప్రచారం చేస్తామని వివరించారు. ఇక్కడ కౌన్సిలర్ భిక్షపతి, రవీందర్, కుమార్‌యాదవ్, బండి సురేశ్, ఖాదర్, అక్షయ్, సాయి, రామకృష్ణ పాల్గొన్నారు.
ఉద్యమకారుడికి గుర్తింపుపై హర్షం
ఓదెల, ఆగస్టు 11: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను నిలబెట్టేం దుకు సీఎం కేసీఆర్ నిర్ణయించడం హర్షణీయమని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఓదెల మండలాధ్యక్షుడు కాశవేని నరేశ్‌యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి, సీఎం కేసీఆర్‌కు విధేయుడిగా ఉంటూ వస్తున్న పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్‌యాదవ్‌కు టీఆర్ఎస్ టికెట్టు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. హుజూరాబాద్ ప్రజలు టీఆర్ఎస్కు పట్టం కట్టడం ఖాయమని పేర్కొన్నారు. శ్రీనివాస్‌యాదవ్‌ను అభ్యర్థిత్వ నిర్ణయం వెలువడడంతో యూత్‌లో కొత్త జోష్ వచ్చినట్లు అయిందని వివరించారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి చేసిన ద్రోహానికి ఈ ఉప ఎన్నికలో తగిన గుణపాఠం తప్పదన్నారు.