Suicide | పెద్దపల్లి కమాన్, నవంబర్ 12 : పెద్దపల్లి ఏఎంసీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ కు పుత్ర శోకం మిగిలింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు విశ్వతేజ (18) మనస్థాపం తో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఈర్ల స్వరూప-సురేందర్ కుమారుడు కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ఈ క్రమంలో హాస్టల్ కి వెళ్లనని కుటుంబ సభ్యులతో గొడవ పడి మంగళవారం రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు ఇండ్లలో అతడి ఆచూకీ కోసం వెతికారు. అయినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. పెద్దపల్లి మున్సిపల్ పరిధి బంధంపల్లి వ్యవసాయ బావి వద్ద చెప్పులు, మొబైల్ ను గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహన్ని బయటకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.