కలెక్టరేట్/ తెలంగాణచౌక్/హుజూరాబాద్ టౌన్/జమ్మికుంట/వీణవంక/సైదాపూర్/ మానకొండూర్/ చిగురుమామిడి/గంగాధర/ కరీంనగర్ రూరల్/చొప్పదండి, డిసెంబర్ 6 : భారతరత్న డా.బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని, శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని కోర్టు చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ మేధావుల ఫోరం జిల్లా కన్వీనర్ ఊడుగుల రాజయ్య నివాళులర్పించి.. దేశానికి అంబేద్కర్ అందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని స్మరించారు. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రపంచానికి చాటే క్రమంలోనే తెలంగాణ తొలి ప్రభుత్వ అధినేత కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి, స్మరించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సమరసతా వేదిక జిల్లా ప్రతినిధి జె.స్వామి, విశ్రాంత వ్యవసాయాధికారి జనార్దన్‌రావు, విశ్రాంత అదనపు కలెక్టర్ కొమురయ్య, వెంకటేశ్ మహారాజ్, అందె మహేశ్, గాజర్ల లక్ష్మయ్య, తైదల మనోహర్‌రావు, జంగ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
నగరంలోని బస్టాండ్ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఖుస్రోషాఖాన్ పాల్గొని నివాళులర్పించారు. కార్యక్రమంలో ఈడీ కార్యదర్శి యుగేంధర్, పర్సనల్ ఆఫీసర్ చంద్రయ్య, డీఎం విజయమాధురి, ఏటీఎం సురేశ్, స్టేషన్ మేనేజర్ అంజయ్య, సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం ఆధ్వర్యంలో నగర కమిటీ నాయకులు కోర్టుచౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళిలర్పించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, సదానందం పాల్గొన్నారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయకులు దామెర సత్యం, నాయకుడు ఎలుక ఆంజనేయులు ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. హుజూరాబాద్ పట్టణంలోని ప్రధాన కూడలిలో అంబేద్కర్ జయంత్యుత్సవ కమిటీ చైర్మన్ ఖాళిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి సభ నిర్వహించగా, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధికాశ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులర్పించారు. అంబేద్కర్ చూపిన మార్గంలో ప్రతి ఒకరూ ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజూరాబాద్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గూడూరు రాజేశ్వరీస్వామిరెడ్డి, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. అలాగే, బార్ అసోసియేషన్ హాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్‌కు నివాళులర్పించారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మట్టెల తిరుపతి, ఏపీపీ రాం ఉపేందర్, ఏజీపీ గుర్రం శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. పట్టణంలోని హెడ్ పోస్టాఫీస్‌లో మహాపరినిర్వాణ్ దివస్‌లో భాగంగా తపాలా ఉద్యోగులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూ మహేందర్, ఇన్చార్జి పోస్ట్ మాస్టర్ ప్రవీణ్ కుమార్, శ్రీనివాస్, తిరుపతి నాయక్, తపాలా సిబ్బంది పాల్గొన్నారు.
జమ్మికుంట పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ చిత్రపటాలకు, విగ్రహాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో అంబేద్కర్, దాని అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల జేఏసీ, మానవ హక్కుల వేదిక, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. వీణవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని గంగారం, ఎలుబాక, మామిడాలపల్లి, కొండపాక, వల్భాపూర్, కనపర్తి, బేతిగల్ గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, ఆయా చోట్ల ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులర్పించారు. దళితసంఘాల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సైదాపూర్ మండలకేంద్రంతో పాటు ఘనపూర్ తదితర గ్రామాల్లో అంబేద్కర్‌కు వివిధ పార్టీల, సంఘాల నాయకులు నివాళులర్పించారు. మానకొండూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు ఉండింటి శ్యాంసన్, గసిగంటి సంపత్, రొడ్డ అంజయ్య, మోదుంపల్లి బాబు, మోదుంపల్లి నర్సయ్య, ఇస్కుల్ల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలోని అంబేదర్ విగ్రహం వద్ద పలువురు నాయకులు, అధికారులు నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మద్దసాని రమేశ్, ఎంపీడీవో భాశం మధుసూదన్, మారెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీ కొత్త వినీత, బీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, సాంబారి కొమురయ్య, మామిడి అంజయ్య, ఎండీ సర్వర్, పాషా, పెనుకుల తిరుపతి, బెజ్జంకి లక్ష్మణ్, కాంగ్రెస్ నాయకులు చిట్టిమల్ల రవీందర్, దాసరి ప్రవీణ్ కుమార్, పూల లచ్చిరెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గంగాధర మండలంలోని బూరుగుపల్లి, మధురానగర్‌లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొని, రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బూరుగుపల్లిలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు దూలం శంకర్ గౌడ్, గడ్డం స్వామి, గడ్డం నర్సయ్య, గడ్డం రమేశ్, కొలిపాక శ్రీనివాస్, మధురానగర్‌లో లింగాల దుర్గయ్య, రోమాల రమేశ్, దోమకొండ మల్లయ్య, ద్యావ శ్రీనివాస్, చిలుముల రాజయ్య, కొలిపాక స్వామి, తాళ్ల శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ మండలం చామనపల్లిలో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు చామనపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, మాజీ సర్పంచులు బోగొండ లక్ష్మీఐలయ్య, గంట శంకరయ్య, మాజీ ఎంపీటీసీలు భూసారపు భూమయ్య, అశోక్, నాయకులు కృపాకర్, టీ శ్రీనివాస్, గర్వంధ శ్రీనివాస్, వెంకటేశం, బాబు, రామస్వామి, ఎల్లయ్య, కొత్తూరి అంజయ్య, గజ్జెల అంజయ్య, బాబు, ఉపేందర్, కె. శేఖర్, గంగరాజు, ఆంజనేయులు, నాగరాజు, శంకరయ్య, నరేశ్, సంపత్, మధు, శ్రీధర్, కొండయ్య, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్‌లో అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు దుబ్బసి హన్మంతరావు, సభ్యులు వెంకటేశం, శంకర్, వెంకట్‌రెడ్డి, పంది తిరుపతి, రమేశ్, తిరుపతి రెడ్డి. గ్రామ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
చొప్పదండి పట్టణంలోని అంబేదర్ విగ్రహం వద్ద అంబేదర్ యువజన సంఘం పట్టణ, మండలాధ్యక్షులు పెద్దెల్లి శ్రీనివాస్, కడారి గంగారాజు ఆధ్వర్యంలో నిర్వహించిన అంబేదర్ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొని, అంబేదర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుర్రం నీరజ, వైస్ చైర్పర్సన్ ఇప్పనపల్లి విజయలక్ష్మి, మారెట్ కమిటీ చైర్మన్ కొత్తూరి మహేశ్, తహసీల్దార్ నవీన్ కుమార్, సీఐ ప్రకాశ్ గౌడ్, ఎంపీడీవో వేణుగోపాల్, నాయకులు, అంబేదర్ సంఘం యువకులు పాల్గొన్నారు.