Rajdhani AC bus | రాజధాని బస్సులో ఎమర్జెన్సీ అలారం.. భయంతో పరుగులు తీసిన ప్రయాణికులు
కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సులో ఎమర్జెన్సీ అలారం రావడంతో డ్రైవర్ అప్రమత్తమై తిమ్మాపూర్ శివారులో బస్సును నిలిపారు.
తిమ్మాపూర్,నవంబర్12 : కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని ఏసీ బస్సులో ఎమర్జెన్సీ అలారం రావడంతో డ్రైవర్ అప్రమత్తమై తిమ్మాపూర్ శివారులో బస్సును నిలిపారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో హైదరాబాద్ వెళ్తున్న బస్సులో అలారం వచ్చింది. దీంతో డ్రైవర్ ను అలెర్ట్ చేసి, ప్రయాణికులు భయంతో దిగిపోయారు. అలారం ఎంతకూ ఆగకపోవడంతో ప్రయాణికులు భయాందోలకు గురయ్యారు. ఇటీవల ఎలక్ట్రికల్ బస్సుల్లో ప్రమాదాల నేపథ్యంలో డీజిల్ బస్సులో కూడా అలారం రావడంతో ప్రయాణికులకు అర్థం కాక ఆందోళన చెందారు.
అయితే బస్సు బ్రేక్ డౌన్ కావడంతో మరో బస్సును ఏర్పాటు చేసేందుకు అధికారులు త్వరగా స్పందించలేదని ప్రయాణికులు ఆరోపించారు. ఇందులో ఎయిర్‌పోర్టుకు వెళ్లేవారు ఉండడంతో ఫ్లైట్ మిస్ అయితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. అనంతరం వచ్చిన బస్సులో హైదరాబాద్ వెళ్లారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | ‘టాక్సిక్’ రిజల్ట్ నన్ను కుంగదీసింది : కియారా అద్వానీ
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

