Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Pat Cummins: ఆసీస్ క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌ను అతని భార్య నిలదీసింది. సిడ్నీ వీధిలోనే కమ్మిన్స్పై ప్రశ్నల వర్షం కురిపించింది. బెక్కీ పదే పదే ప్రశ్నలు వేస్తున్నా.. కమ్మిన్స్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. సాండ్‌పేపర్ గేట్ వివాదంపై ఖవాజా సంచలన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్యాట్, బెక్కీ వీడియో వైరల్ అవుతోంది.
సిడ్నీ: ఆస్ట్రేలియా క్రికెటర్, టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్, ఆయన భార్య బెక్కీ మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. సిడ్నీ వీధిలో ఆ ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. కమ్మిన్స్‌ను అతని భార్య బెక్కీ నిలదీశారు. ఆవేశంతో బెక్కీ మాట్లాడుతుండగా, కమ్మిన్స్ మాత్రం సైలెంట్‌గా భార్య మాటలు వింటూ ఉండిపోయాడు. ఆ ఘటనకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 2018 నాటి సాండ్‌పేపర్ గేట్ స్కాండల్‌కు చెందిన వివాదం ఒకటి ఆస్ట్రేలియా క్రికెటర్లను కుదిపేస్తుండగా, కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ తన భార్యతో గొడవపడుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్ కావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మీడియాను ఉద్దేశించి శుక్రవారం మాట్లాడనున్నట్లు ప్యాట్ కమ్మిన్స్ తెలిపాడు. ఇక తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా కమ్మిన్స్ భార్య బెక్కీ ఓ పోస్టు చేసింది.
2018లో దక్షిణాఫ్రికా టూరులో మూడవ టెస్టు సమయంలో ఆస్ట్రేలియా ప్లేయర్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారు. ఫీల్డింగ్ చేస్తున్న కెమరూన్ బ్రాన్క్రాఫ్ట్ బంతిని సాండ్‌పేపర్‌తో ఓవైపు రుద్దుతున్నట్లు లైవ్ వీడియోలో కనిపించింది. అయితే ఈ ఘటనలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బ్రాన్‌క్రాఫ్ట్‌పై బ్యాన్ విధించారు. ఆ సంచలన ఘటనను సాండ్‌పేపర్ గేట్ అని పిలుస్తున్నారు. ఇక తాజాగా అప్పటి ఆసీస్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. తన ఆత్మకథ బుక్ సబ్ర్ను ఖవాజా రిలీజ్ చేశారు. బాల్ ట్యాంపరింగ్ గురించి ఆసీస్ ఆటగాళ్లు అందరికీ తెలుసు అని ఖవాజా పేర్కొన్నాడు. ఖవాజా ఇచ్చిన స్టేట్మెంట్తో ఆసీస్ క్రికెటర్లు ఇబ్బందుల్లో పడ్డారు. రివర్స్ స్వింగ్ రాబట్టేందుకు బంతిని శాండ్‌పేపర్‌తో రుద్దుతారని ఖవాజా తన బుక్‌లో తెలిపారు. అయితే బౌలర్ల పాత్ర గురించి మాత్రం అతనేమీ వెల్లడించలేదు.
Imagine winning World Cups, WTCs and earning millions every year but still getting bashed by your wife on camera!!
That’s Patt Cummins for you!! https://t.co/n57fXjW6Y6
— Rohit (@Iam_Rohit_G) November 12, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pat Cummins: క్రికెటర్ ప్యాట్ కమ్మిన్స్‌తో సిడ్నీ వీధిలోనే గొడవపడ్డ భార్య.. వీడియో
Shekhar Master | కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారును ఢీకొట్టిన వ్యాన్
భూగర్భ జలాల పెంపునకు ఇంకుడు గుంతలు తప్పనిసరి : ఎంపీడీవో పుల్లారావు
Faridabad Murder: టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి కాల్చివేత.. సీసీటీవీ వీడియో రిలీజ్
Murder | నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మహిళ దారుణ హత్య..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

