Orphan marriage | పెద్దపల్లి, మే 21(నమస్తే తెలంగాణ) : అనాథ వధువు వివాహానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ అన్ని తానయ్యారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆధ్వర్యంలో తలపెట్టిన మానస- రాజేష్ ల కళ్యాణ మహోత్సవం బుధవారం బుధవారం ఉదయం 11 గంటల 5 నిమిషాలకు వైభవోపేతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తబిత బాలల సంరక్షణ సంస్థ పుత్రికను వివాహం చేసుకున్న వరుడు రాజేష్‌తో పాటు అతడి తల్లిదండ్రులు రేణుక, యాకయ్యను అభింనందించారు. ఈ వివాహానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, స్థానిక ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు, డీసీపీ కరుణాకర్, అదనపు కలెక్టర్ డీ వేణు, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహ బంధంతో ఒక్కటైన నూతన వధూవరుల కోసం జిల్లాలోని ఉద్యోగుల నుంచి సేకరించిన రూ.61 వేల 800 చెక్కును కలెక్టర్ అందించారు.