Road Accident | చిగురుమామిడి, ఆగస్టు 2: చిగురుమామిడి మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన మోర రాజు (38)మామిడి కనకయ్య (55) ఇరువురు కలిసి కరీంనగర్ నుండి రేకొండకు కనకయ్య వాళ్ళ చిన్నాన్న ఐదు రోజుల కార్యక్రమానికి హాజరై తిరిగి శుక్రవారం రాత్రి కరీంనగర్ కి వెళుతుండగా, రేకొండ, మొగిలిపాలెం గ్రామ శివారులో మోటార్ సైకిల్ అదుపుతప్పి కనకయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మోర రాజుకు తలకు బలమైన గాయం కావడంతో పాటు కాలు, చేతు విరిగాయి.
అపస్మారక స్థితిలో రోడ్డు మీద పడడంతో అక్కడ ఉన్న స్థానికులు 108 ఫోన్ చేయడంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను అంబులెన్స్ లో కరీంనగర్ గవర్నమెంట్ దవాఖానకు తరలించారు. తీవ్రంగా గాయపడిన మోర రాజు పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కనకయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం స్వగ్రామం రేకొండకు మృతదేహాన్ని తరలించారు. మృతుడికి కుమారుడు, ఇద్దరు కూతుర్లు కలరు.